Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముస్లింలనే అరెస్టు చేసిన పోలీసులు
- ముస్లిం వ్యక్తి భవనం కూల్చివేత
- మధ్యప్రదేశ్‌లో పోలీసుల పక్షపాతం
భోపాల్ : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలపై అరాచ కాలు పెరిగిపోతున్నాయి. ఘర్షణ ఏదైనా, ఎలాంటిదైనా సరే ముస్లింలే బాధితులుగా ఉంటున్నారు. అధికారులు కూడా ముస్లింలపైనే చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనే తాజాగా మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ధార్ జిల్లాలో మనవార్ నగరంలో హిందుత్వ శక్తులు ఈ నెల 23న అట్టహసంగా, డిజే మోగిస్తూ 'శౌర్య యాత్ర' నిర్వహిం చారు. ఈయాత్ర సందర్భంగా అధికారులు, పోలీసుల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతం గాంధీనగర్‌లో ప్రవేశించడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. అయినా హిందుత్వ శక్తులు ఆగకపోకడంతో వారిపై పోలీసులు స్వల్ప స్థాయిలో చర్యలకు దిగారు. అయితే పోలీసులు హిందుత్వ శక్తులపై చర్యలకు దిగి వారిని అడ్డుకోవడం మరో విధంగా రూమర్స్ పుట్టడానికి కారణమయింది.
గాంధీనగర్‌లో హిందు-ముస్లింల మధ్య మత ఘర్షణలు జరుగుతున్నా యనీ, అందుకే హిందుత్వ ర్యాలీపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారనే రూమర్స్ పుట్టుకొచ్చి, వేగంగా వ్యాపిం చాయి. 2016లో కూడా మనవార్‌లో మత ఘర్షణలు చెలరేగాయి. ఆ ఏడాది జనవరి 12న విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన 'శౌర్య యాత్ర' హిందు-ముస్లింల మధ్య ఘర్ష ణలకు కారణమైంది. ఆ ఘర్షణల్లో కూడా పదుల సంఖ్యలో ముస్లింలకు చెందిన దుకాణాలను హిందుత్వ శక్తులు దహనం చేశాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 23న పుట్టిన రూమర్స్ కొన్ని నిమిషాల్లోనే అత్యంత వేగంగా నగరంలో వ్యాప్తి చెందాయి. ఈ రూమర్స్ నేపధ్యంలో గాంధీనగర్‌కు కిలో మీటర్ దూరంలో ఉన్న సింధన రోడ్, నలా ప్రాంగన్ వద్ద హిందూ, ముస్లిం మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యా యి. హిందు-ముస్లింలకు చెందిన వ్యక్తులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘర్షణలపై మనవార్ పోలీసు స్టేషన్లపై మూడు వేరువేరు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 30 మంది పేర్లతో, 22 మంది గుర్తుతెలియన వ్యక్తులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇందులో ఒక కేసు భజరంగ్ దళ్ కార్యకర్త పంకజ్ కుశ్వహ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు కావడం విశేషం.
ఈ మూడు కేసులు ఆధారంగా పోలీసులు ఇప్పటి వరకూ 12మందిని అరెస్టుచేశారు. అయితే అరెస్టుచేసిన వారం దరూ ముస్లింలే కావడం విశేషం. ప్రతక్ష సాక్షులు కథనం ప్రకారం..
ముస్లింలు అధికంగా ఉన్న గాంధీనగర్‌లో ప్రవే శించడానికి హిందుత్వ శక్తులు తీవ్రంగా ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకుంటున్నా, బారికేడ్లు తోసుకుంటూ వెళ్లడానికి ప్రయత్నించారు. అయినా పోలీసులు వారిలో ఒక్కరినీ కూడా అరెస్టు చేయలేదు.
దీనిపై ధార్ ఎఎస్పి ధీరజ్ పాటిదార్‌ను విలేకరులు ప్రశ్నించగా, స్థానికులు అందునా రాళ్లదాడిలో గాయపడిన వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు అధారంగానే కేసులు నమోదు చేశామని, అందులో భాగంగానే అరెస్టులు చేస్తున్నామని సమాధానం ఇచ్చారు అలాగే, ఈ ఘటన జరిగిన రెండు రోజుల తరువాత ఈ ప్రాంతంలో ఉన్న 55 ఏండ్ల ముస్లిం ఖలిల్ ఖాత్రికు చెందిన 3 అంతస్తులు భవనాన్ని జిల్లా అధికారులు కూల్చి వేశారు. భవనం విలువ రూ. 45 లక్షలకు పైగానే ఉంటుందని అంచనా. ఈ భవనంలో ముగ్గురు నిందితులు అద్దెకు ఉంటున్నారని పోలీసులు ఆరోపిస్తుండగా, భవన నిర్మాణ అనుమతిని 24 గంటల్లో అందచేయకపోవడంతోనే కూల్చివేశామని అధికారులు చెబుతున్నారు. అయితే, తాను 'ముస్లిం' వ్యక్తి అయిన కారణంగానే తన ఇంటిని కూల్చివేశారని ఖాత్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.