Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాట మార్చిన కేంద్ర వ్యవసాయశాఖమంత్రి తోమర్
- నోరు తెరిస్తే అబద్ధాలే : ప్రతిపక్షాలు
ఇండోర్: కేంద్రంలోని బీజేపీ ముందుగా లీకులు ఇవ్వటం.. అది కాస్త వివాదస్పదంగా మారితే..అలా అనలేదని బుకాయిం చటం సాధారణమైపోయింది. శనివారం నాడు 'మూడు వ్యవ సాయ చట్టాలను కొందరు నల్ల చట్టాలుగా అభివర్ణించి వివా దాలు సృష్టించారు. అందువల్లే రద్దు చేశాం. అయితే, మేం ఒక్క అడుగు వెనక్కి వేశామంతే. మళ్లీ ముందడుగు వేస్తాం' అంటూ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. దీంతో కేంద్రం మళ్లీ వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చే అవకాశాలున్నాయని ప్రచా రం జరుగుతోంది. విపక్షాలు సైతం కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యకం చేశాయి. యూపీ, పంజాబ్ తో సహ పలు రాష్ట్రాల్లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభుత్వం తిరిగి సాగు చట్టాలను తీసుకొచ్చే కుట్ర చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం మాట మార్చారు. మీడియాలో రికార్డయి ఉన్న..తన వ్యాఖ్యలపై నరేంద్ర సింగ్ తోమర్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. తను అలా చెప్పలేదని, ప్రభుత్వం ఆ చట్టాలను తిరిగి తీసుకురాదని వెల్లడించారు. 'మూడు సాగు చట్టాలను తిరిగి తీసుకొస్తామని నేను చెప్పలేదు.
కేంద్రం మంచి చట్టాలను రూపొందించింది. కానీ, కొన్ని కారణాల వల్ల రద్దు చేయాల్సి వచ్చింది. అయితే, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కషి చేస్తుందని మాత్రమే చెప్పాను''అని కేంద్ర మంత్రి తోమర్ స్పష్టం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఏడాదిన్నరపాటు కొనసాగిన రైతుల నిరసనలకు దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను రద్దు చేసింది. ప్రధాని మోడీనే స్వయంగా రైతులకు క్షమాపణ తెలిపారు. వారి డిమాండ్లను నెరవేర్చేందుకు కేంద్రం అంగీకరించడంతో రైతులు ఆందోళనకు తాత్కాలికంగా ముగింపు పలికి ఇండ్లకు వెళ్లిపోయారు.