Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. సోమవారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 578కి చేరింది.దేశంలోని 19 రాష్ట్రాలకు ఈ వేరియంట్ విస్తరించింది. అయితే151మంది ఈ వేరియ ంట్ నుండి కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ అధికంగా నమోదువుతున్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఢిల్లీ, రెండవ స్థానంలో మహారాష్ట్రలు ఉన్నాయి.ఢిల్లీలో 142, మహారాష్ట్ర 141, కేరళ 57, గుజరాత్ 49, రాజస్తాన్ 43, తెలంగాణ 41, తమిళనాడు 34, కర్ణాటక 31, మధ్యప్రదేశ్ 9, హిమాచల్ ప్రదేశ్లో ఒక కేసు నమోదయ్యాయి.
కాగా, సోమవారం ఉదయానికి గత 24 గంటల్లో
6,531 మందికి కరోనా వైరస్ సోకింది. ఆదివారం
7లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో 7,141మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గి 75,841కి పడిపోయాయి. దేశంలో మొత్తంగా 3.47కోట్ల మందికి కరోనా సోకగా ఇప్పటి వరకూ 3.42 కోట్ల మంది కోలుకున్నారు.