Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఢిల్లీలో రోజువారీ కరోనా కేసుల్లో రెండవ రోజు కూడా పెరుగుదల నమోదైంది. తాజాగా సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 331 కేసులు నమోదు కాగా, అందులో 142 కేసులు ఒమిక్రాన్వి కావడం ఆందోళనకరం. క్రితం రోజు కన్నా 0.5 శాతం అదనంగా మహమ్మారి కేసులు వెలుగుచూశాయి. కాగా, ఆరు నెలల గరిష్టానికి కేసుల సంఖ్య నమోదైంది. దీంతో ఎల్లోఎలర్ట్ను ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం దేశ రాజధానిలో పాజిటివిటీ రేటు 0.68 శాతంగా ఉంది. కాగా, నేటి నుంచి ఢిల్లీలో రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. ప్రస్తుతం ఢిల్లీలో 1,289 మంది కోవిడ్‌కు చికిత్స పొందుతున్నారు. జూన్ నుంచి ఈ సంఖ్య గరిష్టం. ఒకవేళ ఎల్లో అలర్ట్ ప్రకటిస్తే.. సెకండ్ వేవ్ తర్వాత కార్యకలాపాలు తిరిగి నిలిచిపోతాయి. మాల్స్, రెస్టారెంట్లు, షాపులు, సినిమా హాల్స్, స్పా, జిమ్‌లు మూతపడే అవకాశాలున్నాయి. విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు కూడా మూతపడతాయి. ప్రయివేటు సంస్థల్లో 50 శాతం కెపాసిటితో కార్యకలాపాలు సాగుతాయి.
రస్టారెంట్లు, సినిమా ధియేటర్లు, మెట్రో, బస్సులు సైతం 50 శాతం సామర్థ్యంతోనే కార్యకలాపాలను కొనసాగిస్తాయి. వివాహ, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేవలం అతి కొద్ది మందిని మాత్రమే అనుమతినిస్తారు.