Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్యానాలోని అంబాలలో ఘటన
- గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులపై ఎఫ్ఐఆర్
చండీగఢ్ : మత ఘర్షణలకు దారి తీసే మరొక ఘటన బీజేపీ పాలిత హర్యానాలో చోటు చేసుకున్నది. అంబాలలోని హౌలీ రిడీమర్ చర్చిలో కొందరు దుండగులు ఏసుక్రీస్తు విగ్రహాన్ని ధ్వంసంచేశారు. ఈ ఘటనలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 25న క్రిస్మస్ రోజునే అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. అంబాలా జిల్లాలో గల చర్చిపై దాడి శనివారం (25న) రాత్రి జరిగింది. ఘటన అనంతరం చర్చి గేటు వద్ద ముక్కలైన ఏసు విగ్రహానికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో కనిపించాయి. అంబాలలోని సదర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ నరేశ్ మాట్లాడుతూ.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి తర్వాత చర్చి ప్రాంగణంలోకి ప్రవేశించి విగ్రహాలను ధ్వంసం చేశారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఇది తెలిసింది. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని నరేశ్ తెలిపారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని అంబాల ఏఎస్పీ పూజా డబ్లా చెప్పారు.