Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ ఆఫీసు ముందే ధర్నా చేస్తారా?
- పాట్నాలో లాఠీచార్జి, బాష్పవాయుగోళాలు.. జలఫిరంగుల ప్రయోగం
- మహిళలు.. పిల్లలకు తీవ్ర గాయాలు.. ఉద్రిక్తం
పాట్నా. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ కార్యాలయం ముందు బైటాయించిన వార్డు కార్యదర్శులపై పోలీసులు రెచ్చిపోయారు. లాఠీచార్జి చేశారు.దొరికిన వారిని దొరికినట్టు బాదారు.మహిళలు ఉన్నా కనికరం చూపలేదు. పరు గులు తీస్తున్న వారిపై లాఠీలతో కొట్టారు. బాష్పవా యుగోళాలు ప్రయోగించారు. జలఫిరంగులతో నిరసనకారులపై ఖాకీలు ప్రతాపం చూపారు.దీంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. కోపోద్రిక్తులైన ఉద్యోగులు ఏఎస్ఐ ఉమాకాంత్ ప్రసాద్‌ను చుట్టుముట్టగా.. గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో పాట్నాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
డిమాండ్ ఏమిటంటే..!
'గలి-నాలి, నల్-జల్ యోజన' కింద, సీఎం నితీశ్ కుమార్ అమలు చేస్తున్న 'నిశ్చరు పథకం' కింద రాష్ట్రవ్యాప్తంగా1,14,691మందికి ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చారు.ఐదేండ్లుగా పనిచే స్తూనే ఉన్నారు.నితీశ్ సర్కార్ వారి కోసం ఎన్నో హామీలు గుప్పించింది .కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం వారికి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. రాష్ట్రంలోని 38జిల్లాల వార్డు కార్యదర్శులు, ఉద్యో గులు గత13రోజులుగా గార్డినీబాగ్ మహిళా ఠాణా వద్ద నిరాటంకంగా దీక్షలు చేస్తున్నా కనీసం విచా రణకు ఆదేశించలేదు. డిసెంబర్13న బీహార్ ప్రభు త్వం ఒక లేఖను జారీ చేసింది. అందులో పాత వార్డు కార్యదర్శులందరినీ తొలగించి కొత్తగా వార్డు కార్యద ర్శులను నియమించాలని పేర్కొంది. 'ఇంత వరకూ జీతం ఇవ్వటంలేదు.పైగా కొత్తవారిని ఎలా నియమి స్తారం'టూ ఆగ్రహంతో రగిలిపోతున్న ఉద్యో గులు బీజేపీకార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
ఏం జరిగిందంటే..
తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ.. 14వ రోజైన శుక్రవారం వార్డు సెక్రెటరీ యూనియన్ సభ్యులు ప్రదర్శనగా.. గర్దానీబాగ్ నుంచి బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. వందలాది మంది వార్డు కార్యదర్శులు నినాదాలు చేస్తూ.. ధర్నాకు దిగారు. ప్రభుత్వం నుంచి హామీ ఇస్తేనే కదులుతామని ఉద్యోగులు స్పష్టం చేశారు. మేమిక్కడ ఆకలి,దాహంతో అలమటిస్తుంటే.. మంత్రులు మాత్రం విందుల్లో మునిగితేలుతున్నార ని ఉద్యోగ సంఘం నేతలు ఆరోపించారు. గతంలో తమ పదవీకాలం రెండేండ్లు ఉంటే..దాన్ని ఐదేండ్లకు ప్రభుత్వం పెంచిందనీ,కానీ ఇంతవరకూ జీతాలు ఇవ్వలేదని తెలిపారు.ఈలోపు తాజాగా తమను తొలగించి కొత్త వారిని నియమించేలా జీవోను జారీ చేయటం తగదని అన్నారు. నిరసన స్థలమైన గార్డినీబాగ్కు బీజేపీ ఎమ్మెల్యే మురారి మోహన్ ఝా చేరుకుని వార్డు కార్యదర్శులతో సమావేశమయ్యా రు.ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సోమవారం మళ్లీ బీజేపీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగటంతో పోలీసులు ఉగ్రరూపం చూపారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు, పౌర సమాజం ఆగ్రహం వ్యక్తం చేశాయి.