Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ 137 ఆవిర్భావ వేడుకల్లో పార్టీకి ఝలక్ కలిగించేలా ఓ సంఘటన నెలకొంది. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ జెండాను ఎగుర వేశారు. అయితే జెండా ఎగురకుండానే అది ఆమె చేతిలోకి పడిపోయింది. దీంతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కి పడినప్పటికీ.. తేరుకుని జెండాను ఎగురవేయకుండా ...పతాకాన్ని విడదీసి ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నుండి ఇతర పార్టీలకు వలసలు ఎక్కువయ్యాయి. దేశ రాజకీయాలను ఏలిన కాంగ్రెస్.. నేడు పేలవమైన ప్రదర్శనతో ముందుకు సాగుతోంది. అసమ్మతి నేతలు, వలసలు, అంతర్గత విబేధాలు, నాయకత్వ లోపాలు పార్టీని మసకబారే విధంగా చేస్తున్నాయన్నదీ రాజకీయ పరిశీలకుల వ్యాఖ్య.