Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొచ్చి : రాష్ట్రంలో అర్హులైన వారందరకి భూ పట్టాలను ఇవ్వడానికి రాష్ట్రంలోని వామపక్ష ప్రభుత్వం సంకల్పించిందని కేరళ పరిశ్రమల శాఖ మంత్రి పి రాజీవ్ మంగళవారం వెల్లడించారు. ఎర్నాకులం జిల్లాలోని కనయన్నూర్, పరవుర్ తాలూకాల్లోని భూ సమస్యలను పరిష్కరించే కార్యక్రమాన్ని మంగళవారం పథదిపలమ్లోని పిడబ్ల్యూడి రెస్ట్ హౌస్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సమస్యలపై వచ్చిన దరఖాస్తుల్లో సాధ్యమైనవన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. త్వరలో పట్టా మేళ నిర్వహించి పట్టాలను అందచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే టిజె వినోద్, డిప్యూటీ కలెక్టర్లు పిబి సునీలాల్, సంధ్య దేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.