Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయ నిపుణులు
ముంబయి : భారత్‌లో క్రిప్టో కరెన్సీలను పూర్తిగా నిషేధించాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యిందని లక్ష్మీకుమారన్ అండ్ శ్రీధరన్ ఆటర్నీస్ ఎగ్జిక్యూటివ్ పార్ట్నర్ ఎల్ బద్రి నారాయణ్ అన్నారు. దీనిపై ప్రభుత్వం వేచి చూసే దోరణి అవలబించడంతో ఇన్వెస్టర్లు నష్టపోయే అవకాశం ఉందన్నారు. ఈ డిజిటల్ కరెన్సీని ప్రభుత్వం కేవలం నియంత్రించే యోచనలో మాత్రమే ఉందన్నారు. భారత విదేశీ మారకం విధానంలో ఎవరూ కూడా అనుమతి లేకుండా నగదును తీసుకుపోవడానికి వీలు లేదని నారాయణ్ పేర్కొన్నారు. భారత్ లాంటి అభివృద్థి చెందుతున్న దేశాలకు క్రిప్టో కరెన్సీలకు అనుమతివ్వడం ప్రమాదకరమన్నారు. గత రెండు, మూడేళ్లుగా ఆర్బిఐ కూడా ఇదే విషయాన్ని పునరుద్డాటిస్తుంది. అయినా మోడీ సర్కార్ ఈ విషయంలో మెతక వైఖరీ అవలంభిస్తూ.. కాలయాపన చేస్తోంది. భారత్‌లో క్రిప్టో కరెన్సీలపై పాక్షిక నిషేధం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆర్బిఐ ఇటీవలే మరసారి స్పష్టం చేసింది. ఈ వర్చూవల్ కరెన్సీలపై ఆంక్షలు సరిపోవని.. పూర్తిగా నిషేధించాలని సెంట్రల్ బోర్డ్‌కు నివేదించింది. క్రిప్టోలను విలువ కట్టడం, లావాదేవీలను గుర్తించడం క్లిష్టమని, ట్రేడింగ్‌లో తీవ్రమైన ఒడిదుడుకులు, చట్టబద్దమైన అంశాలను సెంట్రల్ బోర్డు ముందు ఉంచింది.
క్రిప్టో కరెన్సీలకు అనుమతించి రిస్క్ తీసుకోవద్దని వర్చూవల్ కరెన్సీ పాలసీ రూపకర్తలను హెచ్చరించింది. క్రిప్టో కరెన్సీల వల్ల ఆర్థిక స్థిరత్వం దెబ్బతినే ప్రమాదముందని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గతంలోనూ ఆందోళన వ్యక్తం చేశారు.