Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆకర్షిస్తున్న 'మెర్సిడీస్-మైబహ్ ఎస్-650 గార్డ్'
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో ప్రధాని మోడీ వేసుకునే దుస్తులు, ఉపయోగించే వస్తువులు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాతో భేటీ సందర్భంగా మోడీ సుమారు రూ.10 లక్షల విలువైన సూట్ వేసుకున్నారు. గతంలో ఆయన ధరించిన ఖరీదైన సన్ గ్లాసెస్ సైతం వార్తల్లో నిలిచింది. తాజాగా మోడీ వాడుతున్న 'మెర్సిడీస్-మైబహ్ ఎస్-650 గార్డ్' అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీకి వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలికేందుకు హైదరాబాద్ హౌస్‌కు వచ్చిన మోడీ తొలిసారి ఈ కారులో కనిపించారు. ఈ మధ్య పీఎం కాన్వారులోనూ ఈ వాహనం కనిపించింది.
అయితే, ఈ కారు విలువ దాదాపు రూ.12 కోట్లు కావడం చర్చనీయాంశంగా మారింది. అత్యున్నత భద్రతా ప్రమాణాలు కలిగిన ఈ కారు విలువ 12 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని సమాచారం. ఇదిలావుండగా, 2019 డిసెంబర్లో సూర్యగ్రహణం చూడడానికి మోడీ పెట్టుకున్న సన్‌గ్లాసెస్ చర్చనీయాంశమయ్యాయి. సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ప్రధాని అత్యంత ఖరీదైన మేబాష్ సన్ గ్లాసెస్ ఉపయోగించారనీ, వాటి ధర కనీనం రూ.లక్షకు పైనే ఉంటుందని ఒక వర్గం వాదించగా, అలాంటిదేమీ లేదని, ప్రధాని సాధారమైన షేడ్స్‌నే ధరించారని ఆయన మద్ధతుదారులు ప్రతిగా ట్వీట్లు చేశారు. ఇక ఈ కొత్త కారు విలువ రూ.12 కోట్లకు పైగా ఉంటుందని తెలియడంతో సమాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ పెలుతున్నాయి. ఇతర ప్రధానుల వస్తువులు, మోడీ వస్తువులను పోలుస్తూ పోస్టులు పెడుతున్నారు. కాగా, ఈ కారు విఆర్-10 స్థాయి భద్రతను కల్పిస్తుంది. సాయుధ దాడుల నుంచి ఈ కారు బలమైన రక్షణ ఇస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. విలాసవంతమైన ఎస్-650 గార్డ్ కారు వినియోగదారులకు అత్యున్నత శ్రేణి రక్షణ కల్పించేలా మెర్సిడీస్ జాగ్రత్తలు తీసుకొంది. కారు బాడీ, విండోస్ ఏకే-47 తూటాలను తట్టుకొని నిలబడతాయి.