Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ, ముంబయి : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుం డటంతో .. ఢిల్లీలో మరోసారి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త నిబంధ నలతో బుధవారం ఉదయం పలు బస్‌స్టాప్‌లు, మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణి కులు బారులు తీరారు. ఒక సర్వీసుకు సగం మందితో మాత్రమే బస్సులను, మెట్రోలను నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో బస్‌స్టాప్‌లు, మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. కొన్ని మెట్రో స్టేషన్ల వద్ద అయితే ఈ క్యూలైన్ సుమారు 2 కిలోమీటర్లకు పైనే ఉంటోంది. క్యూలైన్ల వద్ద ప్రజలు కరోనా ఆంక్షలు పాటించడం లేదు. భౌతిక దూరం సంగతి సరేసరి.. కనీసం మాస్కులు కూడా ధరించకుండా లైన్లలో నిలబడటం గమనార్హం. 2 గంటలు ముందే ఇంటి నుండి బయలుదేరినా ఇక్కడ రద్దీగానే ఉంటోందని, ఇది మంచి నిర్ణయమే అయినప్పటికీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఉంటే బాగుండేదని ప్రయాణికులు వాపోతున్నారు.
5 రోజుల్లో 50 కరోనా కేసులు
మహారాష్ట్రలో ఇద్దరు మంత్రులకూ పాజిటివ్
మహారాష్ట్రలో ఒమిక్రాన్ కోరలు చాపుతోంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై కూడా కరోనా విరుచుకుపడింది. డిసెంబరు 22న ప్రారంభమైన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పోలీసులు కరోనా బారిన పడ్డారు. 5 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో సుమారు 50 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు.
మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్, మరో మంత్రి కెసి పాడ్వి, బీజేపీ ఎమ్మెల్యే సమీర్ మేఘేలకు వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తనకు వైరస్ సోకిందని, స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్టు వర్ష గైక్వాడ్ ప్రకటించారు. ఇటీవల తనను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలనీ, పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అయితే సోమవారం వరకు ఆమె అసెంబ్లీ సమావేశాలకు హాజరైనట్టు అధికారులు తెలిపారు. వీరితో పాటు అసెంబ్లీలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు, అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీసులకు కూడా కరోనా సోకింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాంటాక్ట్ ట్రేసింగ్ చేపట్టి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
మంగళవారం 2వేలకు పైగా కొత్త కేసులు నమోదవగా.. 22 మంది మరణించారు. రాష్ట్రంలో 167 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది.