Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ఈ వేరియంట్‌ను అడ్డుకునేందుకు వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా చేపట్టడం ఒక్కటే మార్గమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో పలు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే వ్యాక్సిన్‌కు భయపడి ఒక వ్యక్తి చెట్టెక్కిన ఘటన చెన్నైలో జరిగింది. పుదుచ్చేరి సమీపంలోని కొనిరికుప్పం గ్రామంలో వైద్య సిబ్బంది సోమవారం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఒక ఇంటికి వెళ్లగానే.. ఆ వ్యక్తి హఠాత్తుగా తనకు చెట్లు కొట్టే పని ఉందంటూ తన నివాసానికి సమీపంలోని చెట్టు పైకెక్కాడు. వ్యాక్సిన్ వేయించుకోవాలని సిబ్బంది ఎంత బతిమాలినా కిందకి దిగేందుకు అంగీకరించలేదు. చెట్టు దిగనంటే దిగనని మొండికేశాడు. పైగా కావాలంటే మీరే చెట్టెక్కి వ్యాక్సిన్ వేయండి అంటూ బదులిచ్చాడు. ఎంత సేపటికీ చెట్టు దిగకపోయేసరికి వైద్య సిబ్బంది అక్కడి నుండి వెళ్లి పోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.