Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత బాలికపై ఓ కుటుంబం దాష్టీకం
లక్నో : ఉత్తరప్రదేశ్లోని అమేథీలో దారుణం చోటుచేసుకుంది. దళిత బాలికపై అత్యంత దారుణంగా ఓ కుటుంబం దాడి చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయగా.. ఒకరిని అరెస్టు చేశారు. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు బాలికను పట్టుకోగా.. మూడవ వ్యక్తి ఆమె పాదాలపై కర్రలతో కొడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దొంగతనం చేశావా అంటూ మరో ముగ్గురు మహిళలు ఆ బాలికను ప్రశ్నిస్తున్నట్టు అందులో కనిపిస్తుంది. ఆ దెబ్బలకు ఆ బాలిక కేకలు వేస్తున్నప్పటికీ... కర్రతో కొడుతూనే ఉన్నారు. బాలిక జుట్టు పట్టుకుని , గుంజుతూ.. ఆమెపై దాష్టీకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు. పోక్సో, ఎస్సి, ఎస్టిపై దాడుల నిరోధక చట్టం కింద నిందితులపై అభియోగాలు మోపినట్టు పోలీస్ అధికారి ఆర్పిత్ కపూర్ తెలిపారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేశామని, మరికొంత మందిని త్వరలో అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. ఈ ఘటనను కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఖండించారు. యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రోజులో కులానికి సంబంధించిన నేరాలు 34, మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి 135 నేరాలు జరగుతున్నప్పటికీ.. పోలీసులు నిద్రపోతున్నారంటూ విమర్శించారు. నిందితులను 24 గంటల్లో అరెస్టు చేయకుంటే... ఆందోళనకు దిగుతామని అల్టిమేటం జారీ చేశారు.