Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త ఏడాదిలో జీఎస్టీ పెంపు
- అసంఘటిత రంగంపై తీవ్ర ప్రభావం
న్యూఢిల్లీ : గత రెండేండ్ల నుంచి కరోనా దెబ్బకు విలవిలలాడుతున్న వస్త్ర పరిశ్రమపై మోడీ సర్కార్ మరో భారం మోపింది. కొత్త ఏడాది జనవరి ఒక్కటో తేది నుంచి వస్త్రాలు, పాదరక్షలపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచింది. కరోనా వైరస్ సంక్షోభంతో ఇప్పటికే వస్త్ర, చేతి వృత్తులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న వేళ ఈ నిర్ణయం ఆ రంగాన్ని మరింత కుదేలు చేయనున్నదని ఆ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ పెంపునతో వస్త్ర ఉత్పత్తులు మరింత ప్రియం కానున్నాయని.. దీంతో అమ్మకాలు పడిపోతాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో 85 శాతం పరిశ్రమ, తుది ఉత్పత్తులు 80 శాతం మేర ప్రభావితం కానున్నాయి. పన్ను పెంపునతో ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. వివిధ యూనిట్లలో దాదాపుగా 15 లక్షల మంది పని చేస్తూ ఈ రంగంపై ఆధారపడ్డారు. అసంఘటిత రంగంలోని చేనేత కార్మికులపై కూడా ఈ ప్రభావం పడనున్నది. చేనేత విభాగంలోని 80 శాతం ఉత్పత్తులపై జీఎస్టీ పడటంతో పవర్ లూమ్, చేనేత కార్మికులపై ఒత్తిడి నెలకొనున్నది.
ఇప్పటికే ముడి సరుకులు, ప్యాకేజింగ్, రవాణ సరుకుల ధరలు 15-20 శాతం పెరిగాయి. జీఎస్టీ పెంపునతో ఈ పరిశ్రమపై మరింత భారం పడనున్నది. ముఖ్యంగా రూ.1,000 లోపు వస్త్ర ఉత్పత్తులపై ఎక్కువగా ప్రభావితం కానున్నాయి. గత రెండేళ్లుగా వ్యాపారం అసలు బాగోలేదని.. ఇటీవల కొన్ని వారాలుగా కోవిడ్ కేసులు మళ్లీ పెరగడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నామని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. గడిచిన ఏడాది కాలంలో పత్తి ధర 70 శాతం పెరిగింది. దీనికి తోడు జీఎస్టీ పెంపు పరిశ్రమపై పిడుగు పడ్డట్టయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పెంచిన పన్ను రేట్లను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. పన్ను రేట్ల పెంపును 60 శాతం మంది ప్రజలు, ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్న అంశాన్ని పరిశ్రమ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయం పూర్తిగా అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వస్త్రాలు అనేవి ప్రజలకు నిత్యావసరాలు.. వీటిపై పన్ను రేట్లను పెంచడం ద్వారా ప్రజలు కూడా ఆర్థిక ఒత్తిడికి గురి కానున్నారని పేర్కొన్నాయి. కొన్ని ఏండ్ల పాటు ప్రస్తుత పన్ను రేటునే కొనసాగించాలని కోరుతున్నాయి. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అమాంతం పెరగ డంతో ద్రవ్యోల్బణం సెగలుగక్కుతోంది. 2021 ప్రారంభంలో రిటైల్ ద్రవ్యో ల్బణం సూచీ 4 శాతం వద్ద ఉండగా.. మధ్య నాటికి ఇది 6 శాతానికి ఎగి సింది. ఇక టోకు ద్రవ్యోల్బణం సూచీ ఏకంగా 2.29 శాతం నుంచి నవం బర్లో రికార్డ్ స్థాయిలో 14.23 శాతానికి చేరి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.