Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజల వెన్నంటే పార్టీ నిలవాలని, వారెదుర్కొం టున్న సమస్యలపై జోక్యం చేసుకొని పని చేయాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు పిలుపునిచ్చారు. అదే ఉద్యమ విస్తరణకు, సంఘటి తానికి మార్గమన్నారు. ఐక్యతతో ఆ కర్తవ్యాన్ని నిర్వ ర్తించాలని చెప్పారు. ఉద్యమ విస్తరణ తిరోగ మనంలో పడిందని నీరసించే వారు ఈ కాలంలో అంతర్జాతీయంగా, జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలను, ఉధృత ప్రజా పోరాటాలను గుర్తెర గాలని సూచించారు. 'చిలీలో ప్రజా కంటక ప్రభుత్వా న్ని ప్రతిఘటనా ఉద్యమాలతో గద్దెదించి వామపక్ష అభ్యర్ధిని గెలిపించారు. అఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు ఛాందస వాదులైనప్పటికీ అంత పెద్ద అమెరికాను దేశం నుంచి పారిపోయేలా చేశారు. జగ మొండి మోడీనే సాగు చట్టాలు ఉపసంహరించే వరకు రైతులు వదలి పెట్టలేద'న్నారు. ఈ అనుభవాలే ఉద్యమ గమనానికి గుణపాఠాలని వివరించారు. సరళీకరణ విధానాలొచ్చాక ప్రజల జీవితాల్లో పెను మార్పులొచ్చాయని, అందుకనుగుణంగా పోరాట పంథాను రూపొందించుకోవాలని చెప్పారు. కూలి, వేతనాల పెంపు, భూపంపిణీ వంటి వర్గ సమస్య లపై పోరాడుతూనే, నివాస ప్రాంతాల్లో ప్రజ లెదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి పోరా టాల్లోకి ప్రజలను సమీకరించాలన్నారు. సరళీకరణ వల్లనే మతతత్వ, అస్థిత్వ వాదాలు ప్రబలుతున్నా యని, వాటిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటే ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందులపై కేంద్రీకరించడమొ క్కటే మార్గమన్నారు. విద్య, వైద్యం ఇత్యాది సేవలను ప్రజలు కొనుక్కోవాల్సి వస్తోందని రాఘవులు వివ రించారు. సామాజిక పోరాటాలు నిర్వహించాలని, కళా, సాంస్కృతిక రంగాల్లో పని చేయాలన్నారు.