Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇక సమరశీల పోరాటాలే : ప్రకాశ్ కరత్
-ఎల్డీఎఫ్ నిర్మాణ లక్ష్యంతో ఉద్యమాలు
తాడేపల్లి : ఆర్ఎస్ఎస్తో కలిసి బీజేపీ సాగిస్తున్న మతతత్వ రాజకీయాలు దేశాన్ని పెను ప్రమాదంలోకి నెట్టాయనీ, ఈ రాష్ట్రానికీ ఆ ముప్పు పొంచి ఉన్నదని చెప్పారు. బీజేపీపై పోరాడే విషయంలో ఏమరపాటు కూడదని హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ రెండవసారి పూర్తి స్థాయి మెజార్టీతో అధికారంలోకొచ్చాక ఆల్‌రౌండ్ దాడులను ఎక్కుపెట్టిందనీ, రాజ్యాంగ విధ్వంసం, అన్ని వ్యవస్థల్లోకి ఆర్ఎస్ఎస్ జొరబడుతున్న వైనాన్ని నిశితంగా పరిశీలిస్తే ప్రమాదం అర్థమవుతుందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ అన్నారు. ఇక్కడ జరుగుతున్న సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర 26వ మహాసభల చివరి రోజు బుధవారం కరత్ ప్రసంగించారు. వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్డీఎఫ్) నిర్మాణం కోసం సమరశీల పోరాటాలు నిర్వహించాలని కరత్ మార్గనిర్దేశం చేశారు. సరళీకరణ, మతతత్వ రాజకీ యాలకు అదే ప్రత్యామ్నాయమన్నారు. 'త్రిపురలో 2017కు ముందు బీజేపీకి 2 శాతం లోపే ఓట్లు న్నాయి. గిరిజనుల్లో కేంద్రీకరించి పని చేసి అధికారంలోకొచ్చింది. మహారాష్ట్రకు చెందిన సునీల్ దేవధర్‌ను త్రిపురకు పంపింది. ఆయన అక్కడ తిష్ట వేసి చేయాల్సిన అన్ని పనులూ చేసి పార్టీని గెలిపిం చారు. అదే వ్యక్తికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పగించార'న్నారు. బెంగాల్లో బలహీనంగా ఉన్న బీజేపీ అనతికాలంలోనే అధికారం కోసం పోటీపడే స్థాయికి ఎదిగిందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రజా వ్యతిరేక, నయా-ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించే విషయంలో రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా మెతక వైఖరికి ఆస్కారం ఉండే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితి ఉన్నదనీ, అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రెండూ బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నాయన్నారు. కోవిడ్ నేపథ్యంలో ప్రస్తుత మహాసభలు అసాధారణ పరిస్థితుల్లో జరుగుతున్నాయని కరత్ గుర్తు చేశారు. పార్టీ, ప్రజా సంఘాల కార్యకలాపాలకు, ఉద్యమాభివృద్ధికి కరోనా ఆటంకంగా తయారైందని పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ మోడీ ప్రభుత్వం తీసుకున్న విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ప్రజా ఉద్యమం జరుగుతోందన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థి తుల్లో సైతం కోవిడ్ సహాయక చర్యలను పార్టీ, ప్రజా సంఘాలు నిర్వహించడం అపూర్వమని కరత్ అభి నందించారు. భవిష్యత్‌లో మూడవ వేవ్ వస్తుందన్న వార్తలపై అప్రమత్తతతో పని చేయాలన్నారు. మహాసభల్లో జరిగిన చర్చలు భవిష్యత్ పోరాటాలకు స్ఫూర్తినిస్తాయన్నారు.