Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధానికి స్టాలిన్ లేఖ
చెన్నై : ఈశాన్య రుతుపవనాల సమయంలో దెబ్బతిన్న రాష్ట్రంలోని మౌలిక సదుపాయాల పున రుద్ధరణ పనులకు ఇవ్వాల్సిన నిధులను విడుదల చేయాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ బుధవారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. లేఖ ప్రతిని మీడియాకు అందచేశారు. కేంద్ర సాయం కింద మంజూరవాల్సిన ఈ నిధులను తక్షణమే అందేలా హోం శాఖను ఆదేశించాలని కోరారు. నవంబరు 21న తమిళనాడులో కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించింది. రహదారులు, వంతెనలు, భవనాలు వంటి మౌలిక సదుపాయాల తాత్కాలిక పునరుద్ధరణ పనుల కోసం రూ.1510.83కోట్లు, శాశ్వత మరమ్మత్తులకు రూ.4719.62కోట్ల మేరకు సాయాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మూడు మెమోరాండాలు సమర్పించింది. నవంబరు 16, 25, డిసెంబరు 15 తేదీల్లో మూడుసార్లు ఈ మెమోరాండాలు ఇచ్చారు. కోవిడ్, తర్వాత వరదల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదని, రాష్ట్ర ప్రభుత్వ విపత్తు సహాయ నిధులన్నీ ఇప్పటికే ఖర్చు చేసామని ఆ లేఖలో పేర్కొన్నారు. దెబ్బ తిన్న మౌలిక సదుపాయాలను వెంటనే పునర్నిర్మించడానికి, బాధితులకు నష్టపరిహారం అందచేయడానికి ఈ నిధులు అవసరమవుతాయని పేర్కొన్నారు.