Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంక్‌ల్లో మోసాలు : ఆర్బీఐ
న్యూఢిల్లీ : బ్యాంకుల్లో మోసాలు అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని మోడీ సర్కార్ అంటోంది. కానీమోసాలు మాత్రం ఆగటంలేదు. పేదలకు రుణాలు ఇవ్వటానికి బ్యాంకు అధికారులు సవాలక్ష అడ్డంకులు పెడుతుంటారు. మరి వేల కోట్ల మోసాలు పాల్పడుతున్న పెద్ద మనుషులెవరో తెలిసి కూడా ఇవ్వటం వల్లే బ్యాంకులకు కష్టాలు ఎదురవుతున్నా యని చర్చ నడుస్తున్నది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) ప్రథమార్థంలో బ్యాంక్‌ల్లో 4,071 మోసపూరిత కేసులు నమోదయ్యాయి. గతేడాది ఇదే ఆరు మాసాల్లో 3,499 కేసులు చోటు చేసుకున్నాయి. దీంతో పోల్చితే గడిచిన ప్రథమార్థంలో మోసపూరిత కేసులు భారీగా పెరిగాయి. వీటి విలువ రూ.36,342 కోట్లుగా ఉన్నదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన రిపోర్ట్‌లో పేర్కొంది. అయితే 2019-20 ఇదే ఏప్రిల్ - సెప్టెంబర్ కాలంలో ఏకంగా రూ.64,261 కోట్ల విలువ చేసే మోసపూరిత కేసులు నమోదయ్యాయి. ఈ విలువతో పోల్చితే క్రితం ప్రథమార్థంలో జరిగిన మోసాల విలువ తక్కువగా ఉన్నది. అత్యధికంగా 1,802 కేసుల్లో రుణాలు పొంది తిరిగి చెల్లించనవే ఉన్నాయి. కార్డులు, ఇంటర్నెట్కు సంబంధించి 1,532 కేసులు చోటు చేసుకున్నాయి. వీటి విలువ రూ.60 కోట్లుగా ఉంది. మొత్తం కేసుల్లో సగం పైగా ప్రయివేటు బ్యాంక్‌ల్లో నమోదు కావడం విశేషం. విలువ పరంగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో మోసాలు ఎక్కువగా జరిగాయి.