Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మహాత్మా గాంధీపై వ్యతిరేకంగా కించపర్చే విధంగా వ్యాఖ్యలు చేసిన హిందు మత నాయకుడు కాళీచరణ్ మహరాజ్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ వారం ప్రారంభంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగించాడనే ఆరోపణలతో మధ్యప్రదేశ్‌లో కాళీచరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణను పూర్తి చేసిన తరువాత కోర్టులో కాళీచరణ్‌పై చార్జీషీట్‌ను దాఖలు చేయనున్నారు. నేరం రుజవయితే కాళీచరణ్‌కు ఐదేండ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంది.