Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిటి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్కు బి.వినోద్ కుమార్ వినతి
న్యూఢిల్లీ : వెనుకబడిన ప్రాంతాలకు నిధులివ్వాలని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్ కోరారు. గురువారం నాడిక్కడ నిటి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకష్ణ రావు కలిశారు. అనంతరం వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో సెక్షన్ 94 ప్రకారం వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం తెలంగాణకు వనరులు ఇవ్వాలని పొందుపరిచారనీ, రాష్ట్ర ఏర్పాటు తరువాత ప్రధాని మోడీ, నాటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖలు రాశారని గుర్తు చేశారు. విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా ఆర్థిక సహాయం చేయాలని కోరినట్టు తెలిపారు. ఇదే అంశాన్ని నిటి ఆయోగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి రాష్ట్రానికి రూ.24 వేల కోట్లు ఇవ్వాల్సిందిగా ఆర్థిక శాఖ మంత్రికి ప్రతిపాదనలు పంపించిందనీ, నాటి నుంచి నేటి వరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. ఇదే అంశంపై కేంద్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రులు లిఖితపూర్వకంగా లేఖలు రాయడంతో పాటు కలిసినప్పుడల్లా అడుగుతున్నారని అన్నారు. విభజన సమయంలో 9 పాత జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా నిటి ఆయోగ్ గుర్తించిందనీ, వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్ ఫండ్ కింద నిధులు ఇవ్వాలని సూచనప్రాయంగా చెప్పడం జరిగిందన్నారు.