Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : సినిమా తరహాలో ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు పట్టపగలు ప్రభుత్వ బ్యాంకును దోచుకెళ్లారు. ముంబయిలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. దుండగుల కాల్పుల్లో ఒక ఉద్యోగి మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ దోపిడీకి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు దహీసర్లోని ఎస్బిఐ బ్రాంచ్‌లోకి బుధవారం సాయంత్రం ప్రవేశించారు. ఒకరు తుపాకీతో బెదిరిస్తుండగా మరొకరు బ్యాంకులో నగదును దోచుకున్నారు. అడ్డుకునేందుకు యత్నించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగిపై కాల్పులు జరిపారు. అనంతరం ఇద్దరూ దర్జాగా అక్కడి నుండి పారిపోయారు. సమాచారం అందుకున్న సీనియర్ పోలీస్ అధికారులు పర్వీన్ పద్వాల్, విశాల్ ఠాకూర్లు బ్యాంకుకు చేరుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ముంబయిలోని మీరా నగర్లో ఒక జ్యుయలరీ షాపులో ఐదు నిమిషాల వ్యవధిలోనే దోచుకెళ్లిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.