Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : నాగాలాండ్‌లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఎఎఫ్ఎస్పీఏ)ను కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలపాటు పొడిగించింది. రాష్ట్రాన్ని కల్లోలిత ప్రాంతంగా పేర్కొంటూ, రాష్ట్రంలో స్థానికంగా పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని, ఈ నేపధ్యంలో ఈ చట్టం అమలును మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబరు 30 నుంచి మరో ఆరు నెలలు ఈ చట్టం అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ ఏడాది జూన్ 30న కూడా చివరి నిమిషంలోనే ఈ చట్టాన్ని మరో నెలలు పొడిగించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ నెల ప్రారంభంలో రాష్ట్రంలోని మోన్ జిల్లాలో భద్రతా దళాల కాల్పుల్లో 14 మంది సాధారణ పౌరులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు స్థానికుల నుంచి పెద్దఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ఆందోళనలూ కొనసాగుతున్నాయి. ఈ రద్దు చేయాలంటూ నాగాలాండ్ అసెంబ్లీ డిసెంబరు 21న ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీంతో ఈ చట్టం ఉపసంహరణ అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర హోంంశాఖ ఇటీవల ఒక కమిటీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా మరోవైపు కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ప్రస్తుత పొడిగింపుతో నాగాలాండ్‌లో 2022 ఏడాది జూన్ 30 వరకు ఈ చట్టం అమలులో ఉంటుంది.