Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్ రూప కల్పనపై నిర్మలమ్మ భేటీ
- పలు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, ఆర్థిక మంత్రులు హాజరు
- రాష్ట్రాల ప్రతి ప్రతిపాదనను పరిశీలిస్తాం : నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి అత్యంత దారుణంగా దెబ్బకొట్టిందనీ, తమకు రుణపరిమితిని పెంచడం, రాష్ట్రాలకు తిరిగి రుణాలు ఇవ్వాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రభుత్వాలు విన్నవించాయి. గురువారం నాడిక్కడ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన కేంద్ర బడ్జెట్ 2022-23 కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో ముందస్తు బడ్జెట్ (ప్రీ-బడ్జెట్) సంప్రదింపుల భేటీ జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి, ముఖ్య మంత్రులు, ఉపముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు, రాష్ట్రా లు, కేంద్ర పాలిత ప్రాంతాల, కేంద్ర ప్రభుత్వానికి చెందిన మంత్రులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఈ సంద ర్భంగా మూలధన వ్యయానికి ప్రత్యేక సహాయం ద్వారా ఆర్థికంగా మద్దతు ఇచ్చినందుకు పాల్గొన్న వారికి కేంద్ర మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో చేర్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రికి పలు సూచనలు చేశారు. కేంద్ర బడ్జెట్‌కు ముందు అవసరమైన ఇన్పుట్లు, సూచనల కోసం పాల్గొనేవారికి ఆర్థిక మంత్రి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాల ప్రతి ప్రతిపాదనను పరిశీలిస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. కేంద్ర ఆర్థిక కార్యదర్శి టివి సోమనాథన్ చర్చకు హాజరైన వారిని స్వాగతం పలికారు. ఈ సమావేశం ప్రాముఖ్యతను ఆయన వివరించారు.