Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈనెల 8న హైదరాబాద్కు రానున్నారు. తెలంగాణ మలయాళీ సంఘాల ఆహ్వానం మేరకు ఆరోజు సికింద్రాబాద్లోని హరిహరకళాభవన్లో జరిగే కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నారు. ఈ సందర్భంగా విజయన్ను ఘనంగా సన్మానించేందుకు మలయాళీ సంఘాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. తెలంగాణలో నివసిస్తున్న మలయాళీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయా సంఘాలు విజయన్ దృష్టికి తీసుకెళ్లనున్నాయి. కేరళ శాసనసభ ఎన్నికల్లో ఎల్డిఎఫ్ సంపూర్ణ మెజార్టీని సాధించి రెండోసారి అధికారం చేపట్టిన సందర్భంగా విజయన్ గౌరవార్థం సన్మానసభకు ఏర్పాట్లు చేశామని మలయాళీ సంఘాల నాయకులు లిబి బెంజిమెన్,రాధాకృష్ణన్, ప్రదీప్ ఒక ప్రకటనలో తెలిపారు.