Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవస్థ ఖరారులో కేంద్రం
- కేంద్ర ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే
న్యూఢిల్లీ : దేశంలో రేషన్‌కార్డు లేని నిరాశ్రయులు, నిరుపేదలకు రేషన్ అందించడం కోసం వ్యవస్థను ఖరారు చేసే పనిలో కేంద్రం ఉన్నదని కేంద్ర ఆహార సెక్రెటరీ సుధాన్షు పాండే తెలిపారు. దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. '' రేషన్ కార్డు లేనివారికి రేషన్ అందించే వ్యవస్థను రూపొందించే ప్రక్రియ కొనసాగుతున్నది. వ్యవస్థ ఏర్పాటు తుది దశలలో ఉన్నది. ఈ ప్రక్రియ అనంతరం దీనిని ట్రయల్‌లో పెడతాం'' అని ఆయన తెలిపారు. ఈ మొత్తం వ్యవస్థ ప్రాథమికంగా రేషన్ కార్డులు లేని ఇండ్లు లేనివారు, నిరాశ్రయులు, నిరుపేద ల కోసమని చెప్పారు. గుర్తింపు లేదా ఇంటి చిరునామా లేకపోవడం వంటి కారణాలతో రాష్ట్ర ప్రభుత్వాలు వారికి రేషన్ కార్డులను జారీ చేయలేదని పాండే తెలిపారు. జాతీయ ఆహార భద్రత చట్టం, 2013 కింద రాష్ట్రాల కవరేజీ ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 1.6 కోట్ల మంది ప్రజలను ఇంకా గుర్తించాల్సి ఉన్నదని ఆహార, ప్రజా పంపిణీ వ్యవస్థ సంయుక్త కార్యదర్శి ఎస్ జగన్నాథన్ చెప్పారు.
ఇక దేశవ్యాప్తంగా 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డు (ఓఎన్ఓఆర్సీ)' పథకం ఇప్పటి వరకూ 75 కోట్ల మంది లబ్దిదారులను కవర్ చేస్తూ 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో (యూటీ) అమలైనట్టు ఫుడ్ డిపార్ట్మెంట్ అధికారులు వెల్లడించారు. దేశంలోని లబ్దిదారులకు రేషన్ కార్డు పోర్టబులిటీని కల్పించే ఈ పథకం అసోం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి ఈ పథకం అమలవుతుందని అధికారులు వివరించారు.