Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : టిబెట్ వేర్పాటువాదానికి మద్దతు ఇవ్వడం మానుకోవాలని ఒక భారతీయ ఎంపీల బృందానికి భారత్లోని చైనా రాయబార కార్యాలయం లేఖ రాసింది. ఢిల్లీలోని హోటల్లో జరిగిన ఒక సమావేశానికి ఆల్ పార్టీ ఇండియన్ పార్లమెంటరీ ఫోరమ్ నుంచి ఆరుగురు ఎంపీలు హజరుకావడం అరుదైన, అణుచితమైన దౌత్య జోక్యంగా వ్యాఖ్యానించింది. 'ప్రవాసంలో టిబెటన్ ప్రభుత్వం' అనేది వేర్పాటువాద, రాజకీయ సమూహమని, చైనా రాజ్యాంగం, చట్టాలను పూర్తిగా ఉల్లంఘించే చట్ట విరుద్ధమైన సంస్థ అని అందరికీ తెలుసునని, ప్రపంచంలోని ఏ దేశం కూడా దీనిని గుర్తించలేదని లేఖలో చైనా రాయబార కార్యాలయం రాజకీయ సలహాదారు జౌ యోంగ్షెంగ్ గుర్తు చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు జైరామ్ మనీష్, మనీష్ తివారీ, బిజెడి ఎంపీలు సుజీత్ కుమార్, బిజెపి ఎంపీలు మేనకాగాంధీ, కె.సి.రామమూర్తి, రాజీవ్ చంద్రశేఖర్ హజరయ్యారు.