Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : ప్రజల మధ్య మతం పేరుతో వివాదాలు రేపడమే బీజేపీ విధానమని మరోమారు స్పష్టమయింది. కర్నాటకలో అధికార బీజేపీ ప్రభుత్వం మరో వివాస్పద అంశాన్ని రేపనుంది. రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు ప్రభుత్వ సంకెళ్ల నుంచి స్వేచ్ఛ ఇవ్వాలని ముఖ్యమంత్రి బొమ్మై ఆలోచన చేస్తున్నారు. అధిక ఆదాయం ఉన్నా హిందూ దేవాలయాలు తమ సంపాదను తమ కోసం ఉపయోగించుకోలేక పోతున్నాయని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది మంచి ఆలోచనగా కనిపిస్తున్నా.. దేవాలయాలను, భక్తులను రాజకీయంగా ఉపయోగించుకోవడానికే బీజేపీ ప్రభుత్వం ఈ ఆలోచనను చేస్తోందని కాంగ్రెస్, జేడీఎస్‌లు ఆరోపించాయి. కనీసం కొన్ని దేవాలయాలనైనా ప్రభుత్వ నియంత్రణలో ఉంచాలని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఆదాయం లేని దేవాలయాలు నిర్వహణ కోసం ప్రభుత్వం మీద ఆదారపడతాయని గుర్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో అన్ని ఎన్నికల్లోనూ పరాజయం చెందుతున్న బీజేపీ ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ వివాదం రేపుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
మళ్లీ క్రియాశీలంగా దేవగౌడ
ఎన్నికల్లో జేడీఎస్ వరస ఓటములు చవిచూస్తున్న నేపధ్యంలో మాజీ ప్రధాని, ఆ పార్టీ నేతయిన 85 ఏండ్లు పైబడిన దేవగౌడ మళ్లీ రాజకీయాల్లో క్రీయాశీలం కానున్నారు. శుక్రవారం మొత్తం దాసరహళ్లిలో గడిపారు. ఈ నియోజవర్గం నుంచి జెడిఎస్ ఎమ్మెల్యే ఎన్నిక కావడంతో నిధుల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం విపక్ష చూపుతుందని దౌవగౌడ విమర్శించారు. ఈ వివక్షను తొలగించకపోతే సీఎం నివాసం ఎదుట నిరాహార దీక్షకు దిగతానని హెచ్చరించారు. అలాగే, రానున్న 15 నెలల్లో రాష్ట్రమంతా పర్యటిస్తానని తెలిపారు.