Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొహాలీలో కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళనబాట
- జాతీయ రహదార్లను దిగ్బంధిస్తామని హెచ్చరిక
న్యూఢిల్లీ : తమ కార్మికసంఘాన్ని గుర్తించాలని, కార్మికుల డిమాండ్డు నెరవేర్చాలని మొహాలీలో కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనబాట పట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే జాతీయ రహదార్లను దిగ్బింధిస్తామని వారు హెచ్చరించారు. మొహాలీలోని 'ఫ్రెడెన్బర్గ్ ఎన్ఓకే' అనే అంతర్జాతీయ కంపెనీ ఆటోమోటీవ్ విడిభాగాల తయారీ యూనిట్లో వేలాదిమంది కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నారు. 'ఫ్రెడన్బర్గ్ ఎన్ఓకే మజ్దూర్ యూనియన్' పేరుతో ఏర్పాటైన కార్మిక సంఘాన్ని గుర్తించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని, ఫ్రెడన్బర్గ్ ఎన్ఓకే కంపెనీ యాజమాన్యాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ఆగస్టు నుంచి కార్మికులు నిరసనబాట పట్టారు. యాజమాన్యానానికి తమకు మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే వారి డిమాండ్లు కంపెనీ యాజమాన్యం పట్టించుకోవటం లేదు. ఈనేపథ్యంలో డిసెంబర్ 14 నుంచి మొహాలీ లేబర్ ఆఫీస్ ముందు కార్మికులు నిరవధిక ఆందోళనకు దిగారు. కంపెనీలో శాశ్వత ఉద్యోగులు వందలోపు ఉన్నారని, కాంట్రాక్ట్ కార్మికులు వేలల్లో పనిచేస్తున్నారని, వీరి సమస్యల పరిష్కారంపై కంపెనీ దృష్టిసారించటం లేదని కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఆరోపిస్తోంది. పంజాబ్ కార్మికశాఖ, కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యపూరిత వైఖరితో కార్మికులకు తీరని అన్యాయం జరుగుతోందని కార్మికసంఘం నాయకుడు శర్మ మీడియాకు తెలిపారు.