Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : ఉత్తర ప్రదేశ్లో అధికారంలోకి వస్తే గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. లక్నోలో శనివారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. రైతులకు సాగునీటి నిమిత్తం ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పారు. 'నివాసాలకు 300 యూనిట్లు, రైతులకు సాగు నీటి నిమిత్తం ఉచిత విద్యుత్ అందిస్తాం' అని హామీలనిచ్చారు. పంజాబ్, గోవా ఎన్నికల నేపథ్యంలో... అక్కడ పోటీకి సిద్ధమైన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సైతం ఇటువంటి హామీలనే ప్రకటించడం గమనార్హం.