Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 63శాతం మందికి రెండు డోసులు
- వైరస్‌ను ఎదుర్కోవటంలో వ్యాక్సినేషన్ అత్యంత కీలకం : వైద్య నిపుణులు
న్యూఢిల్లీ : కరోనా వైరస్‌లో ఎన్ని వేరియెంట్స్ వచ్చినా..వ్యాక్సిన్‌తో దానిని చాలా వరకు అడ్డుకోవచ్చునని డబ్ల్యూహెచ్ఓ, వైద్య నిపుణులు కచ్చితంగా చెబుతున్నారు. అందుకే భారత్‌లాంటి అధిక జనాభా ఉన్న దేశంలో వ్యాక్సినేషన్ అత్యంత కీలకమని చెప్పారు. కానీ మోడీ సర్కార్ ఎంచుకున్న వ్యాక్సినేషన్ విధానం నత్తనడకను తలపిస్తోంది. ఈ ఏడాది పూర్తయ్యేనాటికి దేశంలోని వయోజనులందరికీ రెండు డోసుల టీకా పంపిణీ చేయనున్నట్టు మోడీ సర్కార్ ఘనంగా ప్రకటించింది. అయితే ఆ లక్ష్యానికి చాలా దూరంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిందని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.అర్హులైన (18 ఏండ్లు నిండిన వయోజనులంతా) వారిలో 63శాతం మంది మాత్రమే రెండు డోసులు తీసుకున్నారని గణాంకాలు విడుదలయ్యాయి.కేంద్రం ప్రకటించిన వ్యాక్సినేషన్ పాలసీలో చాలా లోపాలున్నాయని,టీకాల పంపిణీ ప్రయివేటుకు అప్పజెప్పి చేతులు దులుపుకు ందని వైద్య నిపుణులు విమర్శించారు. దేశీయంగా తయారైన, విదేశాల నుంచి దిగుమతి అయిన టీకాల్లో 25శాతం ప్రయివేటుకు కేంద్రం కేటాయిం చింది. అయితే ఆమేరకు ప్రయివేటు హాస్పిటల్స్ టీకాల పంపిణీలో లక్ష్యాన్ని చేరుకోలేదు.మూడో వేవ్ ముంచుకొస్తున్న తరుణంలో కేంద్రం హడావిడి చేస్తోందని,దేశీయంగా టీకాల తయారీ పెంచకుండా ప్రకటనలకే పరిమిత మైందని నిపుణులు అన్నారు.