Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో నూతన సంవత్సర మొదటి రోజున, సీపీఐ(మావోయిస్టు)కి చెందిన 9 మంది మహిళలతో సహా 44 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. సుక్మా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ''పున నాకం అభియాన్''(కొత్త ఉదయం-కొత్త ప్రారంభం)ప్రభావంతో లొంగిపో యారు. లొంగిపోయిన వారిలో ఒకరిపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ.2 లక్షల రివార్డు ఉంది. లొంగి పోయిన మావోయిస్టులతో పాటు వారితో వచ్చిన గ్రామస్తులకు ఆహారం అందించారు. లొంగిపోయిన వారం దిరికీ ప్రభుత్వ పునరావాస పథకాల ప్రయోజనం అందజేస్తామని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ బస్తర్ పోలీస్ పి.సుందర్రాజ్ తెలిపారు.