Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యతిరేకంగా భారత్ అప్పీల్
న్యూఢిల్లీ : ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటిఓ)కు చెందిన వాణిజ్య వివాద పరిష్కర ప్యానెల్ ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా భారత్ అప్పీల్ చేసింది. డబ్ల్యూటిఒ పునర్విచారణ బోర్డు వద్ద భారత్ ఈ అప్పీల్ చేసింది. ప్యానెల్ ఇచ్చిన తీర్పు దేశీయ చక్కెర, చెరుకు మద్దతు చర్యలకు, డబ్ల్యూటీఓ నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని భారత్ ఆరోపించింది. చెరుకు ఉత్పత్తిదారులు, ఎగుమతుదారులకు ఇచ్చే దేశీయ పథకాలను ప్యానల్ తప్పుగా నిర్థారణ చేసిందని, ప్యానెల్ తీర్పును ఆమోదించలేమని భారత్ పేర్కొంది. భారత్ ఇస్తున్న చక్కెర రాయితీలకు వ్యతిరేకంగా బ్రెజిల్, ఆస్ట్రేలియా, గ్వాటెమాలలు చేసిన ఫిర్యాదు విచారణలో ప్యానెల్ గత నెల 14న తీర్పు ఇచ్చింది. ఉత్పత్తి మద్దతు, బఫర్ స్టాక్, మార్కెటింగ్, రవాణ పథకాల కింద ఇస్తున్న సబ్సీడీలను 120 రోజలలోపు ఉపసంహరించుకోవాలని తీర్పులో ఆదేశించింది.