Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళన వ్యక్తం చేస్తున్న హక్కుల కార్యకర్తలు
- కేసులు నమోదుచేసి..చేతులు దులుపుకుంటున్న పోలీసులు
న్యూఢిల్లీ : ఈమధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఆర్టీఐ కార్యకర్తలపై దాడులు పెరిగాయని హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. రాజస్థాన్లో కొద్ది రోజుల క్రితం ఆమ్రా రామ్ గోదారా అనే ఆర్టీఐ కార్యకర్తపై దాడి జరిగింది. తన వాహనంలో ఆయన ప్రయాణిస్తుండగా కొంతమంది అడ్డుకొని, వాహనం నుంచి బయటకు తీసుకొచ్చి అతడ్ని తీవ్రంగా కొట్టారు. గాయపడ్డ అతను హాస్పిటల్లో దయనీయ స్థితిలో ఉన్నట్టు తెలిసింది. దాడిలో ఆమ్రా రామ్ గోదారా చేయి విరిగిందని,కాలి గోళ్లు ఊడబీకారని, బలవంతంగా మూత్రాన్ని తాగించారని స్థానిక మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి. ఈ ఘటనపై హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కుంపాలియా గ్రామ పంచాయితీ పరిధిలో ఉపాధి హామీ పనులకు సంబంధించి సమాచారం కావాలని గోదారా ఆర్టీఐ దరఖాస్తు చేశారు.పీఎం ఆవాస్ యోజనలో అక్రమాలు,అక్రమ మద్యంపైనా ఆయన కీలక సమాచారాన్ని సేకరించారు. ఇదంతా కూడా కొంతమంది ఆయనపై దాడి చేయటానికి దారితీసిందని అనుమానాలు న్నాయి.దాడి ఘటనలో నలుగురు నిందితుల్ని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు.నిందితులకు కోర్టులో శిక్ష పడటం ఖాయమని, అయితే తీవ్రంగా గాయపడ్డ గోదారా పూర్తి ఆరోగ్యాన్ని సంతరిం చుకోవటం సాధ్యం కాదని హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాయాల నుంచి కోలుకొవడానికి చాలా సమయం పడుతుందని, ఆయన పైన్నే ఆధారపడిన కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటని హక్కుల కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇంతకు ముందు కూడా రాజస్థాన్లోని బార్మర్లో మరో ఆర్టీఐ కార్యకర్తపై దాడి జరిగింది. వాట్సాప్ ద్వారా ఆర్టీఐ దరఖాస్తు చేయటంతో కొంతమంది దాడికి తెగబడ్డారు. ఆర్టీఐ కార్యకర్తలపై దాడి జరగటం ఇది మూడో సారి. పోలీసులు కేసు ఫైలు చేయటం తప్ప..దాడుల్ని అడ్డుకునే చర్యలు తీసుకోవటం లేదని హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.