Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన పెగాసస్ నిఘా సాఫ్ట్వేర్ బాధితుల గురించి విచారణ చేయడానికి ఒక ప్రత్యేక సాంకేతిక కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. తమపై పెగాసస్ నిఘా ఉందనే అనుమానం ఉన్న వ్యక్తులు ఈ నెల 7 లోపు తమను సంప్రదించాలని ఈ కమిటీ ఒక బహిరంగ ప్రకటనలో తెలిపింది. వీరి ఫోన్లు పరీక్షించడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. మీడియా సంస్థల ప్రకారం దేశంలోని 142 మంది ప్రముఖల ఫోన్లను పెగాసస్ ద్వారా ట్యాప్ చేశారు. వీరిలో రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో సహా ఒక మాజీ ఎన్నికల కమిషనర్, ఇద్దరు సుప్రీంకోర్టు రిజిస్టార్లు, మాజీ జడ్జీ, 40 మంది జర్నలిస్టులు కూడా ఉన్నారు.