Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
ఇన్ఫార్మర్గా పని చేస్తున్నాడని ఓ మానసిక వికలాంగుడిని మావోయి స్టులు హత్య చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మానసిక వికలాంగుడైన బండి హేమంత్(36) గ్రామంలో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పోలీసులకు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడని భావించి అతన్ని నాలుగు నుంచి ఐదు మంది సాయుధులైన జన మిలీషియా సభ్యులు శనివారం రాత్రి ఇంటి నుంచి అపహరించుకుపోయారు. ఆదివారం తెల్లవారుజామున పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేశారు. బీజాపూర్ ఎస్పీ కమ్లోచన్ కశ్యప్ ఘటనను ధ్రువీకరించారు.