Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకే రోజు కేరళలో 45, ఒడిశాలో 23 ఒమిక్రాన్ కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాపితంగా కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 27,553 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒమిక్రాన్ కేసులు 1525 దాకా ఉన్నాయి. కోవిడ్ మరణాలు 284కి పెరిగాయి.. ఒకే రోజు కేరళలో 45, ఒడిశాలో 23 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేరళలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 152కి చేరుకోగా, ఒడిశాలో కేసలు 37కి చేరాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్క రోజులోనే 3,194, వాణిజ్య రాజధాని ముంబయిలో 8,036 కొత్త కేసులు నమోదయ్యాయి. కోవిడ్ పాజిటివిటీ రేటు 4.59 శాతంగా ఉంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే బ్రిటన్ నుంచి విమాన సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించిన బెంగాల్ ప్రభుత్వం తాజాగా మరి కొన్ని ఆంక్షలు విధించింది. రాష్ట్రంలోనిస్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు, హెయిర్ కటింగ్ సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జంతు ప్రదర్శనశాలలు, వినోద పార్కులు అన్నిటిని సోమవారం నుంచి మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలను సగం సిబ్బందితో నడపాలని, అత్యవసర సేవలకు సంబంధించిన సంస్థలు,దుకాణాలను మాత్రమే ఉదయం 10 నుంచి సాయంత్రం 5వరకు నడిపేందుకు అనుమతిస్తామని చెప్పింది. ఒడిశా ప్రభుత్వం ఒకటో తరగతి నుండి అయిదో తరగతి వరకు స్కూళ్లను సోమవారం నుండి తిరిగి తెరవాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం పెద్దగా ఉండదని, దీని గురించి భయాందోళన చెందక్కర్లేదని, ఆసుపత్రిలో చేరిన కేసులు కూడా తక్కువేనిని అన్నారు. స్కూలు విద్యార్థుల వ్యాక్సినేషన్‌కు సంబంధించిన రిపోర్టు ఎప్పటికప్పుడు తాజా పరచాలని అన్ని స్కూళ్ల యాజమాన్యాలను ప్రభుత్వం ఆదేశించింది. సుప్రీంకోర్టు కేసుల విచారణను ఈ నెల 3 నుంచి ఆన్లైన్లో చేపట్టాలని నిర్ణయించింది.్గ గత అనుభవం దృష్ట్యా 37వేల ఆక్సిజన్ పడకలను సిద్ధం చేసి ఉంచినట్లు ఆయన చెప్పారు. జమ్మూకాశ్మీర్‌లోని వైష్ణో దేవి యూనివర్సిటీ విద్యార్థులు 13 మందికి కోవిడ్ పాజిటివ్ రావడంతో యూనివర్సిటీని మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు.
మూర్ఖంగా మోడీ ప్రభుత్వం : ఏచూరి విమర్శ
కరోనా కేసులు దేశ వ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్నా మోడీ ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించaారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేసిన ఆయన పరిస్థితి మళ్లీ ఆందోళనకరంగా, ప్రమాదకరంగా మారుతోందని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటానికి మోడీ సర్కారు ఎటువంటి ప్రయత్నం చేయడం లేదని పేర్కొన్నారు. ముప్పు ముంచుకొస్తున్నా వ్యాక్సినేషన్ రేటు ముందకొడిగానే ఎందుకు ఉందని ఆయన ప్రశ్నించారు. దీనిని మరింతగా పెంచాల్సి ఉందన్నారు.