Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్య పోరాటాలే మార్గం ొ పబ్లిక్ సెక్టార్ కో-ఆర్డినేషన్ కమిటీ ఆలిండియా కన్వెన్షన్ ప్రారంభసభలో నేతలు
విశాఖ : ప్రయివేటీకరణపై రాజీలేని పోరాటం చేయాలని కార్యికోద్యమ నేతలు పిలుపునిచ్చారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లోని ఆంధ్ర కేసరి కళా క్షేత్రంలో పబ్లిక్ సెక్టార్ ఎక్సెటెండెడ్ కో-ఆర్డినేషన్ కమిటీ కన్వెన్షన్ ఆదివారం ప్రారంభమైంది. ఈ సం దర్భంగా మాట్లాడిన నాయకులు ప్రభుత్వ రంగాన్ని నాశనం చేయడానికి ప్రధాని మోడీ కంకణం కట్టుకున్నారని విమర్శించారు. ఈ విధ్వంసాన్ని ఐక్యపోరాటాలతోనే వెనక్కి కొట్టగలమని అన్నారు. ఈ లక్ష్య సాధన కోసం రైతు ఉద్యమ స్పూర్తితో ఉద్యమించాలని అన్నారు. ఈ సందర్భంగా 'సేవ్ పబ్లిక్ సెక్టార్-సేవ్ ద నేషన్' నినాదాలు మార్మోగాయి. సీఐటీయూ ఆలిండియా జనరల్ సెక్రటరీ తపన్‌సేన్ మాట్లాడుతూ పి.వి.నరసింహారావు హయాం నుంచి నూతన ఆర్థిక విధానాలు దేశంలో అమలు జరుగుతున్నా మోడీ హయాంలో దూకుడు బాగా పెరిగిందన్నారు.
గతంలో ఒక్క రోజే సమ్మె జరిగేదని, వచ్చే నెల 23, 24 తేదీల్లో రెండు రోజుల పాటు జరగనున్న సమ్మె దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులకు అద్దంపడుతోందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రభుత్వాలు గతం నుంచీ చూస్తున్నా, కార్మిక పోరాటాలు ఈ ప్రయత్నాలను నిలువరించాయని తెలిపారు. ఢిల్లీలో ప్రయివేటీకరణకు అనుకూలంగా సంతకాలు జరిగినా భౌతికంగా స్వాధీనం చేసుకోడానికి స్టీల్‌ప్లాంట్‌లోకి ఎవ్వరూ అడుగుపెట్టలేరని, ఇక్కడ ఉన్న కార్మిక ఐక్యత, ప్రజా ప్రతిఘటనే దానికి కారణమని అన్నారు. సీఐటీయూ ఆలిండియా అధ్యక్షులు, పబ్లిక్ సెక్టార్ కో-ఆర్డినేషన్ కమిటీ (ఆలిండియా) కన్వీనర్ కె.హేమలత మాట్లాడుతూ సమ్మె పోరాటాలను దేశంలో నిర్వహించకపోతే ప్రభుత్వ రంగంపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టలేమని అన్నారు. సాధారణ ప్రజలనూ ఈ పోరాటాల్లో భాగస్వామ్యం చేయాలని అన్నారు. 1991 నుంచి ఇప్పటి వరకూ 20 సమ్మెలు జరిగాయని, ఫిబ్రవరి 23, 24 తేదీల్లో జరిగే రెండు రోజుల సమ్మె 21వదని తెలిపారు. ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తే అది ప్రజా ఉద్యమంగా మారుతుందని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన సీఐటీయూ ఆలిండియా కార్యదర్శి స్వదేశ్దేవ్రారు మాట్లాడుతూ సుదీర్ఘ పోరాటం, 32 మంది ప్రాణత్యాగంతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం శోచనీయమన్నారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు స్వాగతోపన్యాసం చేశారు. ప్లాంట్‌లో సీఐటీయూ గుర్తింపు సంఘంగా ఉండడం వల్లనే అన్ని కార్మిక సంఘాలను, 26 పర్మినెంట్ ఉద్యోగుల యూనియన్లను, పది కాంట్రాక్టు కార్మిక సంఘాలను కలుపుకుని సమైక్య కార్మికోద్యమం సాగుతోందని, ప్రజా మద్దతు పెరుగుతోందని అన్నారు. దేశ ప్రజలకు, కార్మికులకు, ప్రభుత్వ రంగానికి బిజెపియే ప్రధాన శత్రువని తెలిపారు.
వేదికపై సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు, ఆలిండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ డి.డి.రామానందన్, ఎలక్ట్రిసిటీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ (ఆలిండియా) ప్రశాంతి నంది చౌదరి తదితరులున్నారు.