Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2021 జనాభా లెక్కల సేకరణ తొలి విడత నిరవధికంగా వాయిదా పడింది. దీంతోబాటు, జాతీయ జనాభా రిజిష్టర్ (ఎన్పీఆర్) తాజాపరిచే ప్రక్రియను ఇప్పుడున్న పరిస్థితి బట్టి సెప్టెంబరు దాకా చేపట్టే అవకాశం లేదని అధికార వర్గాలు తెలిపాయి. జిల్లాలు, ఉప జిల్లాలు, తహసీల్లు, తాలూకాలు, పోలీస్ స్టేషన్లు మొదలైన వాటి సరిహద్దులను స్తంభింపజేయాలన్న నిర్ణయాన్ని ఈ ఏడాది జూన్ వరకు వాయిదా వేస్తున్నట్టు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా గత నెలలో రాష్ట్రాలకు తెలియజేసినట్టు సీనియర్ అధికారి ఒకరు ఆదివారం నాడిక్కడ తెలిపారు.
పౌరసత్వ నమోదు చట్ట సవరణ (సీఏఏ)తో ఎన్పీ ఆర్‌ను ముడిపెట్టడాన్ని వామపక్షాలతో సహా ప్రతిపక్షాలు తీవ్రంగా నిరసించాయి. ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా బీజేపీ, ఆరెస్సెస్‌ల ఫాసిస్టు ఎజెండాలో భాగమే ఇది అన్నది స్పష్టం. బీజేపీ ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా దేశ వ్యాపితంగా నిరసనలు, ఆందోళనలు పెద్దయెత్తున చోటు చేసుకున్నాయి. అయినా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దీనిపై మొండిగా ముందుకెళ్లాలని చూస్తున్నది.