Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఇస్రో గూఢచర్యం కేసులో సీబీఐ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు సోమవారం మరోసారి వాయిదా వేసింది. ఈ కేసులోని మాజీ ఇంటెలిజెన్స్ అధికారులు, పోలీసు అధికారులకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి వ్యతిరేకంగా సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. దానిపై విచారణను కోర్టు జనవరి 28కి వాయిదా వేసింది. సీబీఐ తరపున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు ఈ కేసులో రీజాయిండర్ను దాఖలు చేయడానికి రెండు వారాల గడువు కోరారు. దాంతో జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్ నేతృత్వంలోని బెంచ్ కేసు విచారణను వాయిదా వేసింది.