Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్‌కతా : కేవలం 24 గంటల వ్యవధిలోనే కోల్‌కతా నగరంలో 100 మందికి పైగా వైద్యులు కరోనా బారీన పడ్డ్డారు. అత్యధికంగా కోల్‌కతా నేషనల్ కాలేజ్ అండ్ హస్పటల్లో సుమారు 70 మంది వైద్యులు, కాళీఘాట్‌లో ఉన్న చిత్తరంజన్ సేవా సదన్, శిశు సదన్ ఆస్పత్రిలో 24 మంది వైద్యులు, రీజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆప్థమాలజీలో 12 మంది వైద్యులకు కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు. వీరందరీన్ని వ్యవస్థాగత కార్వంటైన్‌లో ఉండాలని సూచించినట్టు చెప్పారు. ఈ వైద్యుల కాంటాక్ట్ ట్రేసింగ్ కూడా ప్రారంభమయిందని, అలాగే ఈ మూడు ఆసత్రుల్లో ప్రతీ ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం రాష్ట్రంలో 6,153 కేసులు నమోదయ్యాయి. వీటిలో 3,194 కేసులు కోల్‌కతాలోనే వెలుగుచూశాయి.
పాట్నాలోనూ..
బీహార్ రాజధాని పాట్నాలోనూ రెండు రోజుల్లో 100కు పైగా వైద్యులు కరోనా భారీనపడ్డారు. నలంద మెడికల్ కాలేజ్ అండ్ హస్పటల్ (ఎన్ఎంసీహెచ్)లోనే 96 మంది వైద్యులు కరోనాకు గురయ్యారు. వీరిలో అధిక శాతం మంది కోవిడ్ వార్డుల్లో విధులు నిర్వహిస్తున్నారు. బీహార్‌లో కేవలం 10 రోజుల వ్యవధిలోనే క్రియాశీల కేసుల సంఖ్య 30 నుంచి 1,084కు చేరుకుంది.కాగా కోబ్రా టీంలోని 38 మందికి కోవిడ్ సోకినట్టు అధికారవర్గాలు తెలిపాయి.