Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మంగళవారం ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం సందర్భంగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) శుభాకాంక్షలు తెలియచేసింది. బ్రెయిలీ లిపి సృష్టికర్త లూయిస్ బ్రెయిలీ జన్మ దినాన్ని మనం బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరింత సమానత్వం కోసం, హక్కుల కోసం అంధులు జరిపే పోరులో బాసటగా వుంటామని ఎన్పీఆర్డీ పేర్కొంది. 2018లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జనవరి 4వ తేదీని బ్రెయిలీ డేగా ఎంపికచేసింది. ఆ మరుసటి ఏడాది నుంచి దీన్ని జరుపుకుంటున్నారు. పూర్తిగా అంధులైనవారికి, పాక్షికంగా కనబడని వారికి పూర్తి స్థాయిలో మానవ హక్కులు అందేలా చూసే క్రమంలో ఒక కమ్యూనికేషన్ సాధనంగా బ్రెయిలీకి గల ప్రాధాన్యత గురించి చైతన్యం పెంపొదించడం బ్రెయిలీ డే లక్ష్యంగా వుంది.