Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా మూడో వేవ్ ముంచుకొస్తున్న దేశంలో వ్యాపార కార్యకలాపాలు పుంజుకున్నాయని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ నోమురా ఇండియా పేర్కొంది. జనవరి 2తో ముగిసిన వారంలో వ్యాపార సూచీ 120.3కి పెరిగిందని పేర్కొంది. ఇంతక్రితం వారంలో ఇది 120.2గా ఉందని తెలిపింది. కాగా కార్మికుల భాగస్వామ్యం మాత్రం స్వల్పంగా 40.6 శాతానికి తగ్గింది. ఇంతక్రితం వారంలో ఇది 40.7 శాతంగా ఉంది. అదే విధంగా విద్యుత్ డిమాండ్ కూడా 3.1 శాతం క్షీణించినట్లు పేర్కొంది.