Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరోసారి విజయం సాధించేందుకు యత్నాలు
సిలిగురి : సిలిగురి మునిసిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) ఎన్ని కల్లో సీపీఐ(ఎం) మరోసారి విజయం సాధించేందుకు సిద్ధమైంది. మరికొన్ని రోజుల్లో పశ్చిమబెంగాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఎస్ఎంసీలో ప్రస్తుతం సీపీఐ(ఎం) అధికారంలో ఉంది. సీపీఐ(ఎం)కి కంచుకోటైన సిలిగురిలో 2015లో జరిగిన ఎస్ఎంసీ ఎన్నికల్లో 47 స్థానాలకుగాను సీపీఐ(ఎం), మిత్రపక్షాలు 23స్థానాల్లో విజయంసాధించాయి. టీఎంసీ 17సీట్లను గెలుచు కున్నది. సిలిగురి మహాకుమా పరిషద్ పోల్స్‌లో కూడా తొమ్మిది స్థానాలకుగాను ఆరుస్థానాలను సీపీఐ(ఎం)కైవసం చేసుకుంది. వచ్చే ఎన్నికలకుగాను ఇప్పటికే పార్టీ తమ అభ్యర్థులను ప్రకటిం చింది. ఎస్ఎంసీ ప్రస్తుత మేయర్‌గా ఉన్న అశోక్‌భట్టాచార్య నేతృ త్వంలో పార్టీ ఎన్నికల్లో తలపడనుంది.మాజీ డిప్యూటీ మేయర్ నురుల్ ఇస్లామ్ కూడా ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మొత్తం 47స్థానాలకు గాను 43స్థానాల్లో సీపీఐ(ఎం) పోటీ చేయ నుంది. కాంగ్రెస్ 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా,బీజేపీ, టీఎంసీ47 స్థానా ల్లో పోటీ చేయనున్నాయి. సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యు డు అశోక్ భట్టాచార్య మాట్లాడుతూ.. తాను పోటీ చేయాలని పార్టీ పట్టుబట్టిందని,దానికి కట్టుబడి ఉన్నానని అన్నారు. ఎస్ఎంస ీలో గతంలో అధికారంలో ఉన్న టీఎంసీ పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, ప్రజలు అధికారులను కలిసేందుకు ప్రజలు రాకుండా మునిసిపల్ కార్పోరేషన్ కార్యాలయం ఎదుట భారీగేటును నిర్మించారని విమర్శించారు.