Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సీఐటీయూ అధికారిక ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను సోమవారం పున:ప్రారంభించారు. సీఐటీయూ ప్రధానకార్యాలయం బీటీఆర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ ఈ ఖాతాలను ప్రారంభించారు. కార్మిక వర్గంతో ప్రత్యక్ష సంబంధాల కోసం సీఐటీయూ కార్యకర్తలు ఈ ఖాతాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే రైతు ఉద్యమ విజయ స్ఫూర్తితో ఫిబ్రవరి 23,24 తేదీల్లో జరిగే సార్వత్రిక సమ్మెను మరింత విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ కార్యదర్శి ఎ.ఆర్.సింధూ అధ్యక్షత వహించారు. సీఐటీయూ ఉపాధ్యక్షులు జాన్ శంకర్ మజుందార్, కార్యదర్శి ఆర్ కరుమలైయాన్ తదితరలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.