Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ తర్వాతే ఆఫీసుకు..
- కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బడా సంస్థల నిర్ణయం
న్యూఢిల్లీ : కరోనా మూడవ వేవ్ ప్రభావం కార్పొరేట్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కంపెనీలు నెమ్మదిగా ఇంటి నుంచే పనిని (వర్క్ ఫ్రం హౌమ్) అమలు చేయడం ప్రారంభించాయి. ఒమిక్రాన్ తగ్గుముఖం పట్టాక.. ఏప్రిల్ నుంచి ఆఫీస్ గురించి ఆలోచించవచ్చని బడా సంస్థలు భావిస్తున్నాయి.
ఇంటి నుంచే పనికి సిప్లా ఓకే
గత వారం.. ఫార్మా కంపెనీ సిప్లా ఉద్యోగులందరినీ ఇంటి నుంచే పని చేయమని కోరింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు వర్క్ ఫ్రమ్ హౌమ్ మాత్రమే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. దీనికి ముందు డిసెంబర్ చివరి వారంలో, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ కూడా ఇదే విధమైన ఉత్తర్వును జారీ చేసింది.
మహీంద్రాలోనూ వర్క్ ఫ్రమ్ హౌమ్
ప్రతి ఒక్కరికీ ఇంటి నుంచే పనిని అమలు చేసింది. అయితే మహీంద్రా అండ్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ మాత్రం వారంలో మూడు రోజులు ఇంటి నుంచి పని చేసే నియమాన్ని అమలు చేసింది. వాస్తవానికి మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలు 50 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నాయి. 50 శాతం మంది ఉద్యోగులను మాత్రమే కార్యాలయాల్లోకి పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
ఇంటి నుంచి పని చేయడానికి ప్రయివేట్ కు ప్రాధాన్యతనివ్వండి
వర్క్ ఫ్రమ్ హౌమ్ పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రయివేట్ కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది. కరోనా మొదటి వేవ్ తర్వాత.. కార్యాలయాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. రెండవ వేవ్ వచ్చాక మళ్లీ వాటిని మూసివేసింది. ఇక డిసెంబరు నుంచి కార్యాలయాలు ప్రారంభమైన వెంటనే..థర్డ్‌వేవ్ పడగవిప్పటంతో.. మళ్ళీ మూసివేయడం ప్రారంభించింది.
పార్లే, మేక్మైట్రిప్ హెచ్చరికలు జారీ
ఆర్పీజీ గ్రూప్, డాబర్ ఇండియా, మారికో, ఫ్లిప్‌కార్ట్, పార్లే, మేక్మైట్రిప్ వంటి కంపెనీలు కూడా హై అలర్ట్ ప్రకటించాయి. ఈ కంపెనీలన్నీ రాబోయే రెండు మూడు నెలల పాటు వర్క్ ఫ్రమ్ హౌమ్ను అమలు చేయనున్నాయి.ఆర్పీజీ గూప్, రాబోయే కొద్ది నెలల పాటు 50 శాతం మంది ఉద్యోగులను మాత్రమే కార్యాలయానికి రావాలని కోరినట్టు సూచించింది.20-25 శాతం మంది ఉద్యోగులు మారికోలో కార్యాలయానికి తిరిగి వచ్చారు నవంబర్నెలలో.. సాఫ్ట్వేర్ ఇండిస్టీ బాడీ నాస్కామ్ భారత్‌లోని 45 లక్షల మంది టెక్ కార్మికులు వారానికి మూడు రోజులు కార్యాలయంలో ఉండవచ్చని అంచనా వేసింది. అయితే, ఇప్పుడు ఒమిక్రాన్ కోరలు విప్పుతున్న తీరుతో..ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. చాలా టెక్ కంపెనీలు కార్యాలయాలు తెరవటానికి నిరాకరిస్తున్నాయి.
పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. జనవరి 2( ఆదివారం)తో ముగిసిన వారంలోనే.. దేశవ్యాప్తంగా 1.23 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 12 వారాల్లో ఇదే అత్యధిక కేసులు. దీని కారణంగా గత వారం (డిసెంబర్ 20-26)లో 41,169 కేసులు నమోదయ్యాయి. అంటే, దేశంలో కరోనా సంక్రమణ రేటు ఒక వారంలో దాదాపు మూడు రెట్లు పెరిగింది. 82 వేల కేసులు పెరిగాయి.