Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 కోట్ల మందికి అందని కరోనా వ్యాక్సిన్
- డిసెంబర్ 2021 నాటికి వయోజనులకు రోగనిరోధక శక్తినివ్వాలి : కేంద్రం
- 63 శాతం మంది పెద్దలకు మాత్రమే డబుల్‌డోస్
న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం ప్రతిదీ ప్రచారానికి వినియోగించుకుం టున్నది. ఓ వైపు కరోనా విజృంభించినపుడు లైట్ తీసుకున్నది. ఆ తర్వాత వంద కోట్లమందికి టీకా ఇచ్చేశామంటూ ప్రకటనలు గుమ్మరిస్తున్నది. వాస్తవానికి డిసెంబర్ 2021 చివరి నాటికి దేశంలోని వయోజనులందరికీ పూర్తి రోగనిరోధక శక్తిని సాధించాలని కేంద్రం లక్ష్యంగా ప్రకటించింది. వాస్తవం ఏమిటంటే దేశంలో ఇంకా 9.73 కోట్ల మంది పెద్దలకు ఇంకా రెండు డోసులు ఇవ్వాల్సి ఉన్నది. డిసెంబరు 30, 2021 నాటికి, దేశంలోని వయోజన జనాభాలో దాదాపు 63 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసింది. దాదాపు ఏడాది కంటే.. తక్కువ వ్యవధిలో దీన్ని సాధించినా.. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం కంటే తక్కువే. దాదాపు 24.49 కోట్ల మందికి రెండో డోస్ ఇంకా అందలేదు. అంటే దాదాపు 43.96 కోట్ల మందికి నిర్దేశిత మోతాదు లక్ష్యం కంటే తక్కువగా ఇచ్చినట్టు రికార్డులు ధ్రువీకరిస్తున్నాయి.
టీనేజర్లకు టీకా షురూ..
సోమవారం ( 2022 జనవరి 3) 15 నుంచి 18 ఏండ్ల వయస్సు ఉన్న వారికి టీకాలు వేయడం ప్రారంభించింది, అలాగే గుర్తించిన బలహీన వర్గాలకు (ఆరోగ్య సంరక్షణ కార్మికులు, ఫ్రంట్‌లైన్ కార్మికులతో సహా 60 ప్లస్ సమూహాలు) ముందు జాగ్రత్త చర్యతో మోతాదు ఆమోదించింది. దీంతో టీకాల అవసరం పెరగనున్నది.
వ్యాక్సిన్ అవసరమెంత..?
- 15-18 ఏండ్ల వయస్సులో 9.9 కోట్ల మంది లబ్దిదారులున్నారు. వీరికి రెండు డోసులివ్వటానికి దాదాపు 19.8 కోట్ల డోస్‌లు అవసరమవుతాయి.
- ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ కార్మికులకు మరో 3 కోట్ల టీకా మందు కావాలి.
- వాలి. 60 ప్లస్ వయసుగల జనాభాకు 14.2 కోట్ల డోసులు అవసరం
- మిగిలిన వయోజన జనాభాకు దాదాపు 43.96 కోట్ల మోతాదుల అవసరం ఇంకా మిగిలే ఉన్నది.
- ఈ లెక్కన రానున్న కొద్ది నెలల్లో మొత్తం 81 కోట్ల డోస్‌లు అవసరం ఉన్నది.
ఉత్పత్తి సామర్థ్యం - దేశీయ ఉత్పత్తి
ప్రస్తుతం కోవిషీల్డ్ నెలవారీ ఉత్పత్తి సామర్థ్యం 25 నుంచి 27.5 కోట్ల డోస్‌లు కాగా, కోవాక్సిన్ 5 నుంచి 6 కోట్ల డోస్‌లు ఉన్నట్టు కేంద్రం డిసెంబర్ 14న రాజ్యసభకు తెలిపింది. ఈ రెండు -సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) , భారత్ బయోటెక్- వాటి ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యంలో 90శాతం మేర పని చేస్తున్నాయి, దేశంలో వయోజన జనాభాకు టీకాలు వేయడానికి తగినంత వ్యాక్సిన్లు అవసరం ఉన్నాయని ప్రభుత్వం అధికారికంగా గుర్తిం చింది. ఆ దిశగా ఉత్పత్తి జరుగుతున్నది. అయితే 81 కోట్ల డోస్‌ల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి , కేంద్రం ప్రకటించినలక్ష్య సమూహాలను, మిగిలిన వయోజన జనాభాను కవర్ చేయాలని భావిస్తోంది. కానీ ప్రస్తుత ఉత్పత్తి లక్ష్యాలతో పాటు మిగతావన్నీ కవర్ చేయటానికి.. దాదాపు మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుందని అంచనా. కానీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, 15 నుంచి 18 ఏండ్ల వయస్సు ఉన్నవారికి కోవాక్సిన్ తప్పనిసరి వాడకంతో పాటు, ముందు జాగ్రత్త మోతాదును సూచించాల్సిన అవసరం ఉన్నది. ఇక రెండో డోస్ తొమ్మిది నెలలు పూర్తయిన తర్వాత మాత్రమే ఇవ్వాలి. ఇందులో ఈ కాలపరిమితిని మరింత పొడిగించే అవకాశం ఉన్నది.వాస్తవానికి, నవంబర్ 26న అంతర్జాతీయ టీకా షేరింగ్ ప్రోగ్రామ్ కోవాక్స్ కింద ఎగుమతులు పున్ణప్రారంభించనున్నట్టు ఎస్ఐఐ ప్రకటించింది. దేశంలో కేసుల పెరుగుదల కారణంగా 2021 రెండో త్రైమాసికంలో వ్యాక్సిన్ ఎగుమతులను భారత్ నిషేధించింది. ఇప్పుడు సరఫరా వైపు ఉన్న అడ్డంకులు కొంతవరకు తొలగించబ డ్డాయి. అయితే, టీకా రేట్లు ఇప్పటికీ సవాలుగా మారాయి. ఇక సెప్టెంబర్ 2021 నుంచి నిర్వహిస్తున్న మొత్తం డోస్‌ను పరిశీలిస్తే.. నెలవారీ రేటు తగ్గుదల కారణంగా, టీకా లక్ష్యాలను మళ్లీ నిర్దేశించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీనికి తోడు కేంద్రం తగిన విధానపరమైన చర్యలను అనుసరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
పాలసీ స్థాయిలోనే తప్పటడుగులు
'వయోజన జనాభా మొత్తానికి రోగనిరోధకత అనే లక్ష్యాన్ని సాధించలేక పోయాం..? ఎక్కడ విఫలమ య్యాం..?' అని కేంద్రం పరిశీలన చేసుకోవటంలేదన్న చర్చ నడుస్తున్నది. 'లోపభూయిష్ట టీకా విధానానమే' అంటూ.. నిపుణులు పదే పదే ఎత్తిచూపుతున్నారు. ప్రయివేటు రంగం ప్రమేయమూ ప్రధాన కారణమన్న వాదన లేకపోలేదు.
పంపిణీ తీరు ఎలాగంటే...
2021 జనవరి నుంచి ఏప్రిల్ వరకు తయారీదారుల నుంచి కేంద్రం వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసింది. అక్కడ నుంచి రాష్ట్రాలకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. మే 1 నుంచి వ్యాక్సిన్ ఉత్పత్తి, వేగవంతమైన విధానాకి మోడీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో 50 శాతం వాటాను కేంద్రం సేకరించింది .మిగిలిన 50 శాతం తయారీదారులు నేరుగా రాష్ట్రాలకు, ప్రయివేట్ ప్రొవైడర్లకు విక్రయించడానికి అనుమతించబడింది. ఫలితంగా, రాష్ట్రాలు వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లను పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చింది. దీనిని ఔషధ కంపెనీలు పెద్దగా పట్టించుకోలేదు. ఈ విధానం పూర్తిగా విఫలమవడంతో పాటు పెరుగుతున్న అసంతృప్తి, సుప్రీంకోర్టు నుంచి మందలింపు మధ్య, కేంద్రం ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. జూన్ 21 నుంచి మొత్తం 75 శాతం వ్యాక్సిన్లను కేంద్రం కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేయాలనీ , మిగిలిన 25 శాతం ప్రయివేట్ రంగానికి అందుబాటులో ఉంచాలనుకున్నది.
ఆమోదం ఘనం..ఉపయోగిస్తున్న టీకాలు మూడే..
ఇటీవల మౌఖిక ఔషధం మొలుపిరవిర్ (మెర్క్) - కార్బెవాక్స్ (బయోలాజికల్స్ ఈ/బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్) కోవోవాక్స్ (ఎస్ఐఐ .నోవావాక్స్)తో సహా మరో రెండు టీకాలను అత్యవసరంగా ఉపయోగించటానికి కేంద్రం ఆమోదించింది. అంతకుముందు దేశంలో ఆరు వ్యాక్సిన్లకు అనుమతించింది.
కోవిడ్-19 వ్యాక్సిన్ ట్రాకర్
గత రెండు వ్యాక్సిన్లు, మౌఖిక మాత్రలు ఆమోదించబడక ముందే ఆరుగురు టీకా అభ్యర్థులను ఇటీవల ఆమోదించినప్పటికీ, టీకా ప్రచారం ఎక్కువగా ఎస్ఐఐ తయారు చేసిన కోవ్షీల్డ్పై ఆధారపడింది. డిసెంబర్ 30 నాటికి, కోవీషీల్డ్ వ్యాక్సిన్ మొత్తం రోగనిరోధకతలో 89 శాతం వాటాను కలిగి ఉండగా, భారత్ బయోటెక్ ద్వారా స్వదేశీంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ మొత్తం రోగనిరోధకతలో కేవలం 11 శాతం మాత్రమే.
మూడో విడత టీకా ప్రక్రియ
15 నుంచి 18 ఏండ్ల వయస్సు ఉన్న టీనేజర్లకు..మూడో దశగా టీకా ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభించింది. వీరితో పాటు గుర్తించిన బలహీన వర్గాలకు ముందు జాగ్రత్త మోతాదును అందించడానికి ప్రభుత్వం కోవాగ్జిన్‌ను మాత్రమే తప్పనిసరి చేసింది.కోవాగ్జిన్‌ను నెలవారీగా 45 కోట్ల డోస్‌ల సరఫరా సామర్థ్యంతో టీనేజర్లకు 19.8 కోట్ల డోస్‌లను అందించడం సాధ్యమవుతుందా? ముఖ్యంగా దేశంలో పెరుగుతున్న మూడో వేవ్ ముప్పు దృష్ట్యా.. ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం కానున్నాయి..? కరోనా సెకండ్ వేవ్లానే ఒమిక్రాన్ విరుచుపడితే.. పరిస్థేతేంటి? అని ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఉత్పత్తి సామర్థ్యం పైనే దృష్టి..
దేశీయంగా వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం పైనే కేంద్రం దృష్టి సారించింది. ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్,హైదరాబాద్, భారత్ ఇమ్యునో లాజికల్స్ అండ్ బయోలాజికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్, బులంద్‌షహర్, హాఫ్కిన్ బయోఫార్మాస్యూటికల్ కార్పొరేషన్ లిమిటెడ్, ముంబయి, గుజరాత్ కోవిడ్ వ్యాక్సిన్ కన్సార్టియం - ఈ కేంద్రాలన్నీ టీకాల ఉత్పత్తిలో నిమగమై ఉన్నాయి.
ప్రభుత్వ రంగ వ్యాక్సిన్ల తయారీపై..
కోవిడ్-19 విజృంభించిన తీరు.. ఆరోగ్య సేవలనందించడంలో ప్రభుత్వ రంగం పాత్ర ఎంత ముఖ్యమో మరోసారి ప్రస్పుటమవుతున్నది. టీకా ప్రచారం... నివారణ సేవలకు మధ్య ప్రయివేట్ రంగం పాత్ర ఆశించినరీతిలో ఉండటం లేదు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా కేంద్రం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ విపత్తు నిర్వహణ చట్టం, రాష్ట్ర అంటువ్యాధి చట్టాల కింద తమ అధికారాలను వినియోగించుకోవాలి. సీలింగ్ ధరలను నిర్ణయించాలి. కానీ అలా జరగటంలేదు.
సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఏమున్నదంటే..
జూన్ 2021లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రచారంలో ప్రయివేట్ రంగాన్ని భాగస్వామ్యం చేయడానికి కేంద్రం బలమైన వాదన వినిపించింది. అఫిడవిట్ ఇలా చెప్పింది. ''...ఏదైనా ప్రజారోగ్య కార్యక్రమంలో - అది రోగనిరోధకత లేదా మరేదైనా, ప్రయివేట్ ఆస్పత్రుల భాగస్వామ్యం ఎల్లప్పుడూ కావాల్సినదిగా అభిప్రాయపడింది. సరళమైన ధర , వేగవంతమైన జాతీయ కోవిడ్-19 టీకా వ్యూహంలో భాగంగా, తయారీదారుల నుంచి నేరుగా 25 శాతం వ్యాక్సిన్లను కొనుగోలు చేయడానికి ప్రయివేట్ రంగానికి కేంద్రం అనుమతించింది.'' 2021 డిసెంబర్ 7 నాటికి.. కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ల (సీవీసీ) నుంచి దాదాపు 96.3 శాతం ( 108.5 కోట్ల డోస్‌లు) పంపిణీ చేశాయి. అయితే ప్రయివేట్‌కు 3.7 శాతం (41 కోట్ల డోస్‌లు) మాత్రమే ఇచ్చాయి.నివారణ, ప్రచార సేవల విషయానికి వస్తే..ప్రయివేట్ రంగం సహకారం చాలా తక్కువగా ఉంటు ందని పబ్లిక్ పాలసీ, ఆరోగ్య వ్యవస్థల నిపుణుడు చంద్రకాంత్ లహరియా తెలిపారు. భారతదేశంలో సుమారు నాలుగు దశాబ్దాల నాటి సార్వత్రిక ఇమ్యునైజేషన్ కార్యక్ర మం అమలవుతున్నది. అయితే మొత్తం వ్యాక్సిన్లలో ప్రయివేట్ రంగం వాటా 10శాతం నుంచి15శాతం వరకు ఉన్నది. జపనీస్ ఎన్సెఫాలిటిస్,పోలియో, మీజిల్స్ మొదలైన పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ క్యాంపెయిన్లలో ప్రయివేట్ రంగ ం భాగస్వామ్యం ఇంకా తక్కువగా ఉండటం గమనార్హం.
217 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉంచాలని లక్ష్యం..
2021 మే నెలలో కేంద్రం వ్యాక్సిన్ల మోతాదుపై సమీక్షించింది. ఆగస్టు నుంచి డిసెంబర్ 2021 వరకు సుమారు 217 కోట్ల వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలని కేంద్రం అంచనా వేసింది. అయితే, 2021 జూన్‌లో ఈ అంచనాను 135 కోట్ల డోస్‌లకు తగ్గించింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు కేంద్రం సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నది.