Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కతువా లైంగికదాడి.. హత్య కేసులో
శ్రీనగర్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కతువా లైంగికదాడి హత్య కేసులో దోషులైన పోలీసు అధికారులను శిక్షా కాలం పూర్తికాకుండానే విడుదల చేశారు. దీంతో బాధితురాలి కుటుంబం తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నది. మరో పక్క నిందితులందరికి మరణశిక్ష విధించాలన్న బాధిత కుటుంబ సభ్యుల డిమాండ్ ఇంకా పెండింగ్‌లోనే వుంది. నిందితుల బెయిల్ దరఖాస్తులను పరిశీలించడానికి ముందుగానే కుటుంబ సభ్యులు పెట్టుకున్న అప్పీల్‌ను కోర్టు విచారించి వుండాల్సిందని బాధిత కుటుంబం తరపు న్యాయవాది ముబీన్ ఫారూకి వ్యాఖ్యానించారు. 2018 జనవరిలో కతువాకు చెందిన 8 ఏండ్ల బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడి.. అనంతరం ఆమెను హత్యచేశారు. ఆ కేసుకు సంబంధించి ఒక పోలీసు అధికా రికి శిక్షా కాలాన్ని ఇటీవల పంజాబ్ హర్యానా హైకోర్టు రద్దు చేసింది. ఈ కేసులో సాక్ష్యా ధారాలను ధ్వంసం చేసినందుకు ఆనంద్ దత్తా అనే సబ్ ఇనస్పెక్టర్‌ను దోషిగా నిర్ధారించి సర్వీసు నుంచి తొలగించారు. ఆ సంఘటన జరిగిన సమయంలో పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా దత్తా వున్నారు. ఆయనకు ఐదేండ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. కానీ, గత నెలలో ఆయన మిగిలిన శిక్షా కాలాన్ని రద్దు చేస్తూ వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలకు ఆదే శించారు.