Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణ మంత్రికి నివేదిక
న్యూఢిల్లీ: దేశ తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి వాతావరణమే కారణమని నివేదిక స్పష్టం చేసింది. ఈ ప్రమాదంపై త్రివిధ దళాల విచారణ నివేదికను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు బుధవారం అందచేశారు. కూనూర్ (ప్రమాద ప్రాంతం)పై ఆకస్మాత్తుగా ఏర్పడిన మేఘాలు పర్వతాన్ని ఢకొీనడానికి దారి తీసాయని నివేదిక పేర్కొంది. హెలికాప్టర్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని నివేదిక తెలిపింది. ప్రమాదానికి ముందు పైలెట్ నుంచి ఎలాంటి ప్రమాదరకరమైన ఫోన్ కాల్స్ రాలేదని గుర్తు చేసింది. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఎంఐ 17 వి5 కంట్రోల్డ్ ఫ్లైట్ ఇన్‌టూ టెర్రైన్ (సీఎఫ్‌ఐటీ) మోడ్‌లోనే ఉందని, ప్రమాదకర వాతావరణల్లో ఎక్కువ విమాన ప్రమాదాలకు, ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో విమాన ప్రమాదాలకు ఇదే అత్యధిక కారణమని నివేదిక పేర్కొంది.