Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : తమిళనాడులోని విరుదునగర్ జిల్లా సాత్తూర్లో బాణా సంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆ ఫ్యాక్టరీ యజమాని కుప్పుస్వామితో సహా ఇద్దరు కార్మికులు కాశీ, సెంధిల్ కుమార్ మరణించారు. ఈ ఘటన బుధవారం ఉదయం 7.30 గంటలకు మంజలోడైపట్టి గ్రామంలో జరిగింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న ఏడుగుర్ని రక్షించి.. కోవిల్పట్టి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఐదు రోజుల్లో విరుదునగర్ జిల్లాలో ఇది రెండవ పేలుడు ఘటన. ఈ నెల 1న సాత్తూర్ సమీపంలోని కళత్తూరు గ్రామంలోని బాణా సంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి.. ఐదుగురు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు.