Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : హరిద్వార్ ఇటీవల జరిగిన మత విద్వేష ప్రసంగాలపై 270 మందికి పైగా ప్రముఖులు, సంస్థలు ఆందోళన వ్యక్తం చేశారు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. వీరిలో నావల్ స్టాఫ్ మాజీ చీఫ్ అడ్మినర్ ఎల్.రామ్‌దాస్, రాష్ట్రీయ సేవాదళ్ అధ్యక్షులు డాక్టర్ గణేష్ దేవీ, మాజీ ఐఎఎస్, మజ్దూర్ కిసాన్ శక్తి సంగతన్ అరుణ్ రారు, మాజీ ఐఎఫ్ఎస్ దేవ్ ముఖర్జీ, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎపి షా, మాజీ ఐపిఎస్, పంజాబ్ గవర్నర్ మాజీ సలహాదారు జూలియో రిబైరో, సంగీత విద్యాంసులు, రచయిత టిఎం క్రిష్ణ, కళాకారుడు ఎస్జి వాసుదేవ్, రచయిత బద్రీ రైనా, జర్నలిస్టు పమీల ఫిలిపోస్, రచయిత, న్యాయవాది బెలా భాటియా, ఉద్యమవేత్త బన్వార్ మేఘవాన్షి, నటీ నందితా దాస్, జెఎన్‌యు ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయిక్ తదితరులు ఉన్నారు.